హీరోయిన్స్ విషయంలో బోయపాటి పొదుపు.. ఖర్చు తక్కువ గ్లామర్ ఎక్కువ

కమర్షియల్ సినిమాలో గ్లామర్ హీరోయిన్స్ కూడా చాలా కీలకమనే చెప్పాలి. హాట్ సాంగ్స్ తో అలాగే రొమాంటిక్ సీన్స్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళతారు. ఇక మాస్ దర్శకుడు బోయపాటికి కూడా హీరోయిన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకరిపై ఎమోషనల్ భారాన్ని మేపితే మరో నటిపై గ్లామర్ బాధ్యతను అప్పగిస్తారు. ఈ దర్శకుడు నెక్స్ట్ బాలకృష్ణతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమా బడ్జెట్ విషయంలో బోయపాటి చాలా వరకు తగ్గాల్సి వచ్చింది. అనుకున్న దానికంటే కూడా బాలకృష్ణ మార్కెట్ కి తగ్గట్టుగానే ఖర్చు చేస్తున్నారట. కానీ బోయపాటికి అది సరిపోదని మొదట్లోనే టాక్ వచ్చింది. ఇక అప్పటికే రెమ్యునరేషన్ కూడా తగ్గించుకున్నారట. అసలు మ్యాటర్ లోకి వస్తే బోయపాటి, బాలయ్య కోసం ఈ సారి ముగ్గురు హీరోయిన్లను ఫిక్స్ చేయనున్నాడు. ఇప్పటికే అంజలి, మళయాళం బ్యూటీ ప్రయగా మార్టిన్ మెయిన్ హీరోయిన్స్ గా ఫిక్స్ అయ్యారు.

 Three glamorous heroines for balakrishna upcoming movie

ఇక మరో బ్యూటీ పూర్ణని కూడా ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హీరోయిన్స్ కి బోయపాటి మార్కెట్ కంటే తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని తెలుస్తోంది. పైగా ముగ్గురు కూడా గ్లామర్ తో ఆకట్టుకోబోతున్నారట. ముఖ్యంగా పూర్ణ చేస్తున్న పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. ఆమె రెండు విభిన్నమైన షేడ్స్ లలో కనిపించనుందని సమాచారం. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక త్వరలోనే ఫైనల్ షెడ్యూల్ ని ఫీనిష్ చేసి 2021 సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X