NBK109: ఫ్యాన్స్ చొక్కాలు చించుకునే అప్‌డేట్.. నందమూరి బాలకృష్ణకు ముగ్గురు హీరోయిన్లు.. ఎవరెవరంటే?

గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు ఉన్న క్రేజ్.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని అభిమానుల గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా నటనతో ఇరగదీసే బాలకృష్ణకు ప్రస్తుతం 62 ఏళ్లు. ఇంత వయసు వచ్చినా ఆయన ఎడతెరిపి లేకుండా చిత్రాలు చేస్తూ అందరి చేత ఆహా అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా మాస్ చిత్రాల్లో నటిస్తూ.. అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నారు. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బాలయ్య బాబు అదే ఊపుతో మరికొన్ని చిత్రాలను లైన్ లో పెట్టారు.

ముఖ్యంగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు. అయితే ఇది బాలకృష్ణకు 109వ సినిమా కావడంతో దీనికి NBK 109 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. సితార ఎంటర్ టైన్ మెంట్ పతాకం, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాను నిర్మిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగ్గా.. ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయింది.

Three Heroines in Nandamuri Balakrishna Next Movie NBK 109 Check Details

సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందు నుంచే ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. బాలకృష్ణ హీరోగా అనే సరికి ఆయన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా NBK 109 సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకు రాబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. మూడు కాలాలకు సంబంధించిన కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు మూడు పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయం ఇప్పటికే లీక్ కాగా.. ఇప్పుడు మరో విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Three Heroines in Nandamuri Balakrishna Next Movie NBK 109 Check Details

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారు. ముఖ్యంగా మూడు కాలాలకు ఒక్కో హీరోయిన్ కనిపించనున్నారా, లేక ఓ కాలంలో ఇద్దరు మరో కాలంలో... ఇంకో కాలంలో ఎవరూ లేకుండా ఉంటారా అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. కానీ ముగ్గురు హీరోయిన్లతో బాలకృష్ణ ఆటా, పాటలు ఉండబోతున్నట్లు మాత్రం తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే హీరోయిన్ల ఎంపిక కూడా పూర్తి అయిందట. అయితే బాలకృష్ణ సరసన నటించే అవకాశం పొందిన ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

Three Heroines in Nandamuri Balakrishna Next Movie NBK 109 Check Details

హై ఓల్టేజీ యాక్షన్ తో సరికొత్తగా రాబోతున్న ఈ సినిమాలో త్రిషతో పాటు ఊర్వశీ రతౌలా, మీనాక్షి చౌదరిలు కనిపించబోతున్నారు. ఇప్పటికీ ఈ ముగ్గురు హీరోయిన్స్ కన్ఫార్మ్ కాగా... బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఊర్వశీ రతౌలాకు సంబంధించిన సన్నివేషాలను తెరకెక్కిస్తున్నారట. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X