RRR టికెట్ల కోసం వెళ్లి ముగ్గురు యువకుల మృత్యువాత.. విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన RRR చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల జైత్రయాత్రను ప్రారంభించింది. తెలుగు సినిమా అభిమానులు సంతోషంతో సినిమాను ఆస్వాదిస్తున్నారు. అయితే వారం రోజులపాటు హౌస్‌పుల్ కావడంతో సగటు ప్రేక్షకులకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్ల కోసం బయటకు వెళ్లిన ముగ్గురు యువకులను మృత్యువు కాటేసింది. దాంతో చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకొన్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

1920 నాటి నేపథ్యంగా RRR
తెలుగు తెరపై 1920 నాటి నేపథ్యంగా బ్రిటీష్ పాలనలో తెలుగు వీరులు అల్లూరి సీతారామారాజు, కొమురం భీమ్ పాత్రల నేపథ్యంగా తెరకెక్కిన RRR చిత్రం మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆలియాభట్, అజయ్ దేవగన్, సముద్రఖని నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది.

భారీగా బ్లాక్ టికెట్లు
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్లను థియేటర్ యాజమానులు, నిర్వాహకులు భారీ ఎత్తున బ్లాక్ చేశారనే వార్తలు వచ్చాయి. దాంతో సామాన్య ప్రేక్షకులకు టికెట్లు దొరకడం కష్టంగా మారింది. పెద్ద ఎత్తున్న బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారనే వార్తలు మీడియాలో వచ్చాయి. డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెద్ద ఎత్తున టికెట్లను అమ్మకుండా కృత్రిమ కొరతను సృష్టించారనే ఆరోపణలు మీడియాలో కనిపిడయం తెలిసిందే.

RRR టికెట్ల కోసం వెళ్లి మృత్యువాత
అయితే వారం రోజులపాటు టికెట్లు అడ్వాన్సుగా అమ్ముడుపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు టికెట్లు లభించడం కష్టంగా మారింది. దాంతో పలు మార్గాల ద్వారా టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముగ్గురు యువకులు టికెట్ల కోసం వెళ్లి చిత్తూరు జిల్లాలో ప్రాణాలు పోగొట్టుకొన్నారు. ఈ విషాదకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టికెట్లు దొరకపోవడంతో నిరాశగా
చిత్తూరు జిల్లా పోలీసులు మీడియాకు వెల్లడించిన ప్రకారం.. గురువారం రాత్రి RRR సినిమాకు సంబంధించిన బెన్‌ఫిట్ షో టికెట్స్ కోసం బయటకు వెళ్లారు. టికెట్లు కోసం ప్రయత్నించగా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో యువకుడు మృత్యువుతో పోరాటం చేస్తున్నాడు అని పోలీసులు తెలిపారు.
Recommended Video


ప్రమాద ఘటనపై పోలీసుల దర్యాప్తు
చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకొన్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. సంఘటనా స్థలంలో పడి ఉన్న యువకుల మృతదేహాలను పోస్టుమార్టమ్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే యువకుల మరణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా పలువురిని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. స్నేహితులు, సన్నిహితులు, మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నిపించింది.


Click it and Unblock the Notifications











