#TholiPrema4K పవన్ కల్యాణ్‌కు నెలవారి ఖర్చులు.. తొలి ప్రేమ రెమ్యునరేషన్‌తో ఏం కొన్నాడో తెలుసా?

తెలుగు సినిమా పరిశ్రమలో తొలి ప్రేమ చిత్రం సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇండస్ట్రి రికార్డుగా నిలిచింది. పవన్ కల్యాణ్‌ కెరీర్‌లో అతిపెద్ద విజయంగా నిలిచింది. అలాంటి చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నది. అలాంటి చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి తొలి ప్రేమ రీ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ నేపథ్యంలో నిర్మాత జీవీజీ రాజు మాట్లాడుతూ..

తొలి ప్రేమ సినిమా కథ ముందుగా పవన్ కల్యాణ్ విన్నారు. ఆ తర్వాత నన్ను పిలిచి జీవిజీ గారు మీరు కథ వినండి అన్నారు. నేను కథ విన్న తర్వాత ఈ సినిమా పక్కాగా డైరెక్టర్ ఫిలిం. బాగా ప్రజెంట్ చేస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాను. దాంతో మీరు కాన్ఫిడెన్స్‌గా ఉన్నారా? అని అడిగారు. అందుకు నేను సరే అన్నాను. అలా తొలి ప్రేమ సినిమా మొదలైంది.

throwback story of Tholi prema: Producer GVG Raju about Pawan Kalyans remuneration

తొలి ప్రేమ 25 ఏళ్ల క్రితం ప్రారంభమైనప్పుడు అందరం యంగ్ టీమ్‌గా ఉన్నాం. పవన్ కల్యాణ్, ఆనంద్ సాయి, కరుణాకరన్, వాసుకి, టెక్నిషియన్స్ అందరం కొత్తవాళ్లే. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. చాలా ఫ్రెండ్లీగా సినిమా తీసేశాం అని జీవీజీ రాజు తెలిపారు.

తొలి ప్రేమ రిలీజ్ తర్వాత మొదటి రోజు నుంచే బిగ్ హిట్ అనే టాక్ వచ్చింది. అప్పటి కలెక్షన్లను పరిగణనలోకి తీసుకొంటే.. ఇప్పటి ఇన్‌ఫ్లేషన్ లెక్కలోకి తీసుకొంటే.. చాలా పెద్ద హిట్. ఆ కలెక్షన్లు ఇప్పుడు లెక్క వేస్తే ఊహించని విధంగా బాక్సాఫీస్ నంబర్లు ఉంటాయి.

తొలి ప్రేమ రిలీజ్‌కు ముందు చిరంజీవి గారు సినిమా చూడలేదు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన చూశారు. తొలి ప్రేమ చూసిన తర్వాత వెంటనే మా అందర్ని పిలిచి అభినందించారు. ముఖ్యంగా కరుణాకరన్‌ను భుజం తట్టి కంగ్రాట్స్ చెప్పారు. పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు అని జీవిజీ రాజు చెప్పారు.

throwback story of Tholi prema: Producer GVG Raju about Pawan Kalyans remuneration

పవన్ కల్యాణ్ అప్పటికీ ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఓ వ్యక్తిగా స్వచ్చమైన మనిషి. నాకు తెలిసిన వ్యక్తిగా ఎలాంటి కల్మషం లేని వ్యక్తి. నిజాయితీతో కూడిన వ్యక్తి. రాజకీయాలు, ఇతర పరిస్థితుల వల్ల ఏదైనా మార్పు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఆయన చాలా క్లీన్ పర్సన్ అని జీవీజీ రాజు అన్నారు.

తొలి ప్రేమ సినిమాకు తక్కువగానే రెమ్యునరేషన్ ఇచ్చాను. సినిమా ఒప్పుకొన్న తర్వాత రెమ్యునరేషన్ ఫిక్స్ చేశాం. కొంత అడ్వాన్స్ ఇచ్చాను. ఆ తర్వాత కొద్ది కొద్దిగా కావాలా అని అడిగాను. దాంతో మీకు ఎలా వీలైతే అలా ఇవ్వండి అన్నారు.

నేను కొంత అడ్వాన్స్ ఇచ్చి.. సినిమా అయిపోయిన తర్వాత మొత్తం ఇస్తానని చెప్పాను. అయితే.. నాకు నెల నెల కొంత ఖర్చులకు ఇవ్వండని పవన్ అన్నారు. అందుకు సరే అని నేను చెప్పాను. నేను నెల నెల ఇచ్చిన డబ్బుతో మొబైల్ ఫోన్, బుక్స్ కొనుక్కొన్నారు. సినిమా రిలీజైన రెండో రోజు మొత్తం రెమ్యునరేషన్ పళ్లెంలో పెట్టి ఇచ్చాను అని జీవీజీ రాజు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X