Rashmika -Vijay Wedding: రష్మిక కు అత్తమామల కండిషన్స్..వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ పేరెంట్స్ వీడియో!
Rashmika -Vijay Wedding: విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వార్త టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ సమీపంలో ఉన్న లగ్జరీ రిసార్ట్‌లో వివాహ వేడుక జరుగనున్నది. ఈ స్టార్ కపుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం. ఇప్పటికే కుటుంబ సభ్యులు,అత్యంత సన్నిహితులతో కలిసి ఇద్దరూ ఉదయ్‌పూర్ చేరుకున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పాత వీడియో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటీ? ఇంతకీ విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు ఇంతకీ ఏమన్నారంటే?
విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లికి కేవలం రెండు రోజుల ముందు ఓ పాత వీడియో ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోలో విజయ్ తల్లిదండ్రులు తమకు కాబోయే కోడలు ఎలా ఉండాలి? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ వీడియోలో విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ.. 'నాకు ఒక్కటే కావాలి... నా కొడుకును కంటికి రెప్పలా చూసుకునే అమ్మాయి వస్తే చాలు. అతను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి అతని ప్రొఫెషన్‌ని అర్థం చేసుకునే మనసుండాలి. ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి'అని చెప్పింది. ఈ మాటలు ఇప్పుడు రష్మికకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మావయ్య కండిషన్...
ఇదే ఇంటర్వ్యూలో విజయ్ తండ్రి గోవర్ధన్ రావు చాలా క్లియర్‌గా చెప్పారు. 'నాకు కులం, మతం వంటి అంచనాలు లేవు. విజయ్ ఎవరిని ప్రేమిస్తే వారినే పెళ్లి చేసుకోవాలి. కానీ ఒక చిన్న కోరిక.. ఇండియన్ అమ్మాయి, ముఖ్యంగా సౌత్ ఇండియన్ అయితే సంతోషమే.' అని తెలిపారు. అంటే... అత్తమామలు ఇద్దరూ కూడా పిల్లల ఇష్టానికే పెద్దపీట వేస్తారని ఈ మాటలతో స్పష్టమవుతోంది.
ఈ వీడియో అసలెక్కడిదంటే...
ఈ క్లిప్ 2018లో విడుదలైన గీతా గోవిందం (Geetha Govindam) సక్సెస్ మీట్‌లోది. ఆ ఈవెంట్‌లో యాంకర్ సుమ విజయ్ పేరెంట్స్‌ను 'కాబోయే కోడలు ఎలా ఉండాలి?' అని అడగగా వాళ్లు ఈ సమాధానాలు చెప్పారు. అప్పట్లో ఇది సరదాగా అనిపించినా... ఇప్పుడు అదే వీడియో పెళ్లి ముందు వైరల్ కావడం విశేషం.
విజయ్-రష్మిక అప్పుడే ఏమన్నారు?
ఓ ఈవెంట్‌లోనే విజయ్ కూడా ఓ ఆసక్తికర విషయం చెప్పారు. 'నాకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదు. లవ్ మ్యారేజ్ చేస్తా. కానీ నేను ప్రేమించే అమ్మాయిని నా పేరెంట్స్ కూడా ప్రేమించాలి.' ఇక తాజాగా రష్మిక కూడా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పరోక్షంగా విజయ్ గురించి మాట్లాడుతూ 'నా జీవితంలో నాకు అండగా నిలిచే పార్టనర్ దొరికాడు' అంటూ ఎమోషనల్ అయ్యారు.
పెళ్లి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్స్ జరుగుతుండగా, పెళ్లి పూర్తిగా ప్రైవేట్‌గా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆరావళి కొండల మధ్య ఉన్న ఈ రిసార్ట్‌లో 117 విలాసవంతమైన గదులు, సరస్సు, హెలిప్యాడ్ వంటి హైఎండ్ సౌకర్యాలున్నాయి. గెస్ట్ లిస్ట్ దాదాపు 100 మందికే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖుల కంటే కుటుంబ సభ్యులు, కొందరు దర్శకులు, తెలంగాణకు చెందిన కొద్దిమంది రాజకీయ నాయకులే హాజరయ్యే అవకాశముందని టాక్.


Click it and Unblock the Notifications











