Thug Life Trailer Review: థగ్ లైఫ్ ట్రైలర్ రివ్యూ.. యుముడితోనే యుద్ధం అంటూ కమల్ విశ్వరూపం!

లోక నాయకుడు కమల్ హాసన్ రచనా సహకారంతో సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా థగ్ లైఫ్. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఉదయనిధి స్టాలిన్, ఆర్ మహేంద్రన్ తదితరులు నిర్మించిన ఈ సినిమా జూన్ 5వ తేదీన రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

1987 సంవత్సరంలో నాయకన్ సినిమా తర్వాత 38 ఏళ్ల అనంతరం కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తోపాటు శింబు, త్రిషా కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మీ, సాన్యా మల్హోత్రా, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్, పంకజ్ త్రిపాఠి, మహేష్ మంజ్రేకర్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రవి కే చంద్రన్, ఎడిటర్‌గా ఏ శేఖర్ ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహ్మన్ వ్యవహరించారు.

Thug Life Trailer Review

రంగరాయ శక్తివేళ్ నాయకర్‌గా కమల్ హాసన్ పవర్‌ఫుల్ ఎంట్రీతో థగ్ లైఫ్ ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. నీవు నా ప్రాణాలు కాపాడిన వాడివి. యముడికి దొరకకుండా వెనక్కి లాగినోడివి. నీ తలరాత.. నా తలరాత ఒకటిగా రాశాడు. ఇక మీద నీవు నేను ఒకటే.. చివరి వరకు అంటూ కమల్ చెప్పే డైలాగ్స్‌తో ఎమోషనల్‌గా మొదలైంది. తలతన్నే వాడిని అంటూ అమరన్‌గా శింబు పాత్రను పరిచయం చేశాడు. అలా ఆ ఇద్దరు పాత్రల కెమిస్ట్రీని చక్కగా చూపించే ప్రయత్నం ట్రైలర్‌లో జరిగింది.

గ్యాంగ్‌స్టర్ ప్రపంచానికి అమరన్‌ను పరిచయం చేస్తూ.. లోపలి వ్యవహారాలు నేను చూసుకొంటాను. బయటి వ్యవహారాలను అమరన్ చక్క బెడుతాడు అంటూ రంగరాయ శక్తివేల్ చెప్పడం కనిపించింది. ఈ వ్యవహారం గ్యాంగ్‌స్టర్ గ్రూపులో చీలికలు, ప్రతీకారం వైపు అడుగులు వేసేలా చేశాయి. నాజర్ పాత్ర ద్వారా గ్రూపులో రెబల్ కనిపించాడు. అమరన్ అన్నీ చూసుకొంటే నేను ఎందుకు? వెంట్రుక పీకడానికా? అంటూ ఆవేశంతో నాజర్ ఊగిపోతూ కనిపించాడు.

Take a Poll

కమల్ హాసన్ ఉన్నారంటే.. ఈ సినిమాలో నవరసాలు ఉంటాయి. ఈ చిత్రంలో కూడా రొమాంటిక్ సీన్లకు కొదవలేదన్నటు రెండు సీన్ల ద్వారా రుచి చూపించాడు. భార్య అభిరామితో లిప్ లాక్, ఇక తన ప్రియురాలు త్రిషతో రొమాంటిక్ సన్నివేశాలు ఎట్రాక్టివ్‌గా ఉన్నాయి. మేడమ్.. ఐయామ్ ఓన్లీ యువర్ ఆడమ్‌ను అంటూ కమల్ చెప్పిన రొమాంటిక్ డైలాగ్స్ క్రేజీగా ఉంది. త్రిషా కృష్ణన్ గ్లామర్ పాత్రతోనే కాకుండా పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది.

ఇక కథలో ట్విస్టు ఉండాలి కదా.. యుముడి నుంచి తనను రక్షించిన అమరన్‌ ఏకంగా తనపైనే కత్తి దూయడం.. అలాగే తన సామ్రాజ్యాన్ని హాస్తగతం చేసుకొని.. ఇక నుంచి నేనే రంగరాయ శక్తివేల్ అంటూ ప్రకటించుకోవడం కథలో భారీ మలుపుగా కనిపించింది. ఇది యముడికి నాకు జరిగే కథ. ఇందులో నువ్వా? నేనా అంటూ రంగరాయ ఛాలెంజ్ విసరడం భారీ చిక్కుముడిగా ఉంది. రంగరాయ, అమరన్ మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? ఎవరు ఎవరిని వెన్నుపోటు పొడిచాడు? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. జూన్ 5వ తేదీన థగ్ లైఫ్ సినిమా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X