సినీ ప్రేక్షకులకు శుభవార్త.. 99 రూపాయలకే మూవీ టికెట్!
సినిమా లవర్స్‌కు శుభవార్త. మల్టీప్లెక్స్‌లో భారీ ధరకు కాకుండా తక్కువ రేటుకే వినోదాన్ని అందించేందుకు పీవీఆర్ మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. సినిమా లవర్స్ డే సందర్భంగా శుక్రవారం అంటే ఫిబ్రవరి 23వ తేదీన 99 రూపాయలకే సినిమా టికెట్‌ను అందించనున్నది. పీవీఆర్ మల్టీప్లెక్స్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే..
సినిమా లవర్స్ డే ను పురస్కరించుకొని ఆడియెన్స్‌కు ఈ కానుకను పీవీఆర్ ఐనాక్స్ సినిమా చైన్ థియేటర్స్ అవకాశం కల్పించింది. 99 రూపాయలకే ఆల్ ఇండియా ర్యాంక్, ఆర్టికల్ 370, క్రాక్, తేనీ బాతోం మే ఐసా ఉల్జా జియా, ఫైటర్ సినిమాలను వీక్షించే అవకాశం కల్పించింది.

అలాగే మేడమ్ వెబ్, ది హోల్డర్స్ అండ్ బాబ్ మార్లే వన్ లవ్, మీన్ గర్ల్స్, ది టీచర్స్ లాంజ్ సినిమాలను కూడా 99వ రూపాయలకే చూడవచ్చని తెలిపారు.
ఇక విలాసవంతమైన రిక్లైనర్ సీట్ల కోసం, అలాగే ఐమాక్స్, 4డీఎక్స్, ఎంఎక్స్4డీ, గోల్డ్ కేటగిరిల రేట్లను 199 రూపాయలకే కుదించారు. ఈ సినిమా లవర్స్ డే రోజును ఘనంగా జరుపుకోవడానికి ఈ అవకాశం కల్పించినట్టు పీవీఆర్ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపారు.


Click it and Unblock the Notifications











