Tiger 3 twitter Review సల్మాన్ మూవీకి షాకింగ్ రిపోర్ట్.. అతిథి పాత్రలో షారుక్ ఓ రేంజ్‌లో.. టైగర్ 3 ఎలా ఉందంటే
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలీవుడ్ బ్యూటీ కంత్రినా కైఫ్, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ అంచనాలు క్రియేట్ చేసింది. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ సిరీస్‌లో భాగంగా మూడో చిత్రంగా టైగర్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 12వ తేదీన రిలీజైన ఈ చిత్రంపై నెటిజన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే?

టైగర్ 3 చిత్రం రెగ్యులర్ కథతో స్టైలిష్‌గా రూపొందింది. ప్రధాన పాత్రల్లో నటించిన వారి ఫెర్ఫార్మెన్స్ ఆకట్టుకొన్నది. ఈ సినిమా ద్వారా అభిమానులకు ఏమి ఇవ్వాలో అదే ఇచ్చారు. ఇంతకంటే ఏమీ ఇవ్వగలను అనే రేంజ్‌లో ఆకట్టుకొన్నాడు. జోయా పాత్రలో కత్రినా యాక్షన్ సీన్లలో అదరగొట్టింది. ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్‌లో ఆకట్టుకొన్నాడు. షారుక్ అతిథి పాత్రలో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు.
టైగర్ 3 రోరింగ్ బ్లాక్‌బస్టర్. మనీష్ శర్మ జేమ్స్ బాండ్, బౌర్న్ తరహాలో ఎమోషన్స్‌తోపాటు యాక్షన్ ప్యాక్ట్ సినిమాగా మార్చారు. స్పై థిల్లర్లకు బాప్‌గా నిలిచిన సల్మాన్ ఖాన్ ఈ సినిమా ద్వారా కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇమ్రాన్ హష్మీ విలనిజం, కత్రినా కైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అదరగొట్టారు. స్పై యూనివర్స్‌లో బెస్ట్ సినిమా అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
స్పై యూనివర్స్‌లో అత్యంత బలహీనమైన సినిమా టైగర్ 3. పేలవమైన కథ, అంతా ఊహించినట్టుగానే ఉండటం మైనస్. సల్మాన్ ఖాన్ పాత్ర ఏమాత్రం బాగాలేదు. సినిమాలో నిద్రపోయినట్టు ఆయన పెర్ఫార్మెన్స్ ఉంది. షారుక్ ఖాన్ ఉండే 20 నిమిషాలే సినిమా బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
టైగర్ 3 సినిమా చూసి అలిసిపోయాను రొటీన్ స్టఫ్, తొలి 30 నిమిషాలు బాగుంది. షారుక్ ఖాన్ అతిథి పాత్ర చాలా ఫన్ క్రియేట్ చేసింది. ఫైట్స్ బోరింగ్‌గా ఉన్నాయి. స్టైల్ తప్ప సినిమాలో ఏమీ లేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాను నెటిజన్ అన్నాడు.
టైగర్ 3 సినిమా నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ చాలా నీరసంగా కనిపించాడు. అతడి నటనలో పసలేదు. సినిమాలో ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కనిపించలేదు. యానిమేషన్ సినిమా చూసినట్టు ఉంది. షారుక్ సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు. కానీ సాగదీసినట్టు ఉండటంతో ఆకట్టుకోలేకపోయింది. కత్రినా తన పాత్రకు తగినట్టు నటించింది.
సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌కు మాత్రమే ఎక్సైట్‌మెంట్‌గా ఫీలవుతారు. ఈ నాటికి ఈ సినిమాలో నటించిన వారికి బిగ్గెస్ట్ సినిమా. ఈ సినిమా కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను అని నెటిజన్ అన్నారు.
ఇండియాలో టైగర్ 3 సినిమా చరిత్ర సృష్టించడానికి బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ను సల్మాన్ ఖాన్ కూడా చూశారు అని ఓ నెటిజన్ పోస్టు పెట్టారు.


Click it and Unblock the Notifications











