Tiger Nageshwar Rao twitter Review టైగర్ నాగేశ్వర్‌రావు ఇంటర్వెల్ సీన్ కేక... రవితేజ ఎలా ఉందంటే?
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ వంశీ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ చిత్రంలో చిత్రంలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా, రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు అమెరికా, ఇతర దేశాల్లో ఒకరోజు ముందే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఈ సినిమా గురించి వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు ప్రాంతంలోని స్టూవర్ట్ పురంలోని పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం తెరకెక్కింది.

టైగర్ నాగేశ్వరరావు సినిమాను చాలా ఎంగేజింగ్‌గా చెప్పాడు. ఎక్కడ ఇంపార్టెంట్ సీన్ మిస్ అవుతామనే ఫీల్‌తో మూడు గంటలు వాష్ రూమ్‌కు కూడా వెళ్లలేదు. ఇంటర్వెల్ సీన్ బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
టైగర్ నాగేశ్వరరావు మూవీలో రవితేజ మాస్ ఎంట్రీ అదిరిపోయింది. రవితేజ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. సినిమాలో స్క్రీన్ ప్లే హైలెట్, ఫైట్స్, జీవీ ప్రకాశ్ మ్యూజిక్, ఇంటర్వెల్ సీన్ అదిరిపోయాయి. ఓవరాల్‌గా సినిమా అదిరిపోయింది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో మరోసారి రవితేజ మాస్ అవతారంలో కనిపించాడు. యాక్టింగ్ సూపర్‌గా ఉంది. జీవీ ప్రకాశ్ బీజీఎం బాగుంది. వంశీ స్టోరి, సెంటిమెంట్‌ను బాగా పండించాడు. ఫైట్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. సినిమా చూసిన ప్రేక్షకుడు మంచి ఫీల్‌తో బయటకు వస్తాడు. ఎండింగ్ అలా ఇచ్చి ఉండకపోతే ఏదో వెలితి ఉండేది వంశీ గారు అంటూ నెటిజన్ పోస్టులో పేర్కొన్నాడు.
టైగర్ నాగేశ్వరరావు మూవీ థ్రిల్లింగ్ రైడ్, రవితేజ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. యాక్షన్, ఎలివేషన్స్, ఎమోషన్స్‌తో డైరెక్టర్ వంశీ సినిమాను మంచిగా బ్యాలెన్స్ చేశాడు. 3 గంటలపాటు టైగర్ నాగేశ్వరరావు ప్రపంచంలో కొత్త అనుభూతిని నింపాడు. సాంగ్స్ అంతగా బాగా లేవు. బీజీఎం, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. సెకండాఫ్‌లో కొన్ని లోపాలు ఉన్నాయి. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.
టైగర్ నాగేశ్వరరావు మూవీ స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్టాఫ్, ఇంటర్వెల్‌ను బాగా హ్యాండిల్ చేశాడు. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి. సెకండాఫ్‌ను గ్రిప్పింగ్‌గా చెప్పారు. ఇంతకంటే నేను ఎక్కువగా చెప్పి ప్రేక్షకుల ఆసక్తిపై నీళ్లు చల్లలేను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
టైగర్ నాగేశ్వరరావు మూవీ స్టార్ట్ ఫర్‌ఫెక్ట్‌గా అయింది. స్క్రీన్ ప్లే బ్రిల్లియంట్‌గా ఉంది. ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయితే కేజీఫ్‌లాంటి సినిమా తెలుగు పరిశ్రమకు అవుతుంది అని నెటిజన్ పోస్టు పెట్టాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా బాగుంది. సినిమా చూసిన తర్వాత కొందరు ఇంటెలెక్చువల్స్ హీరో క్యారెక్టర్ నెగిటివ్‌గా ఉంది. అమ్మాయిలపై లైంగిక దాడులు చేశాడు అంటూ ఈకలు పీకె ప్రయత్నం చేస్తారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా ఫస్టాఫ్ బాగుంది. సినిమా మొత్తం దొంగతనాల చుట్టూ తిరుగుతుంది. రవితేజను నెగిటివ్ రోల్‌లో చూడటం బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఓవరాల్‌గా సినిమా బాగుంది అని నెటిజన్ అభిప్రాయపడ్డాడు.
సినిమా దోపిడీ సీన్‌తో మొదలవుతుంది. మొదటి 30 నిమిషాలు అద్బుతంగా ఉంటుంది. ఆ తర్వాత సినిమా స్లోగా అనిపిస్తుంది. ఎలివేషన్స్ తక్కువగా కనిపిస్తాయి. స్టోరీ ఆధారంగా సినిమా నడుస్తుంది. కాన్సెప్ట్, బీజీఎం, ఇంటర్వెల్ సీన్ బాగుంది. ఓవరాల్‌గా సినిమా బాగుంది అని నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











