TigerNageswaraRao trailer Reviewప్రధాని సెక్యూరిటీకి చెమటలు పట్టించిన స్టూవర్ట్‌పురం దొంగ..ట్రైలర్ ఎలా ఉందంటే?
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన సొంత బ్యానర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై రూపొందించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో మయాంక్ సింఘానియా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిసత్ున్నారు. అక్టోబర్ 20వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?
టైగర్ నాగేశ్వరరావు మూవీ బయోపిక్‌గా అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. స్టూవర్ట్ పురం గ్రామానికి చెందిన దొంగ నాగేశ్వరరావు ధనికులను దోచి.. పేదలకు పంచి పెట్టే రాబిన్ హుడ్ క్యారెక్టర్. అయితే ముందే పోలీసులకు సవాల్ విసిరి దొంగతనం చేయడం నాగేశ్వరరావు స్టైల్. అయితే ఏకంగా ప్రధాని ఇందిరాగాంధీ నివాసంలో దొంగతనం చేస్తానని సవాల్ విసిరిన టైగర్ నాగేశ్వరరావు ఆ పని సక్సెస్‌ఫుల్‌గా చేశాడా? అనేది టైగర్ నాగేశ్వరరావు కథ.

గుంటూరు రైల్వే స్టేషన్‌లో దొంగతనానికి సంబంధించిన వేలం పాటతో ట్రైలర్‌ను ఆసక్తికరంగా చూపించాడు. దొంగతనానికి ధైర్యం మాత్రమే కాదు.. తెలివి తేటలు కూడా కావాలి అని చెప్పడం టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. స్టూవర్ట్ పురంలో దొంగల మధ్య ఆధిపత్యం సినిమాలో ఓ పాయింట్‌గా కనిపించింది.

టైగర్ నాగేశ్వరరావు నాయకుడిగా ఎదగడంతో అతడికి వచ్చిన కష్టాలు.. స్టూవర్ట్‌పురం నాగేశ్వరావు.. టైగర్ నాగేశ్వరరావును ఎలా మార్చింది. టైగర్ నాగేశ్వరరావు ఎందుకు ఓ పెద్ద సవాల్ విసిరాడు. ప్రధాని సెక్యూరిటీకి చెమలు పట్టించే సవాల్‌ను టైగర్ నాగేశ్వరరావు ఎందుకు విసరాల్సి వచ్చింది. ప్రధాని ఇంటిలో టైగర్ నాగేశ్వర్ రావు దొంగతనం చేసి.. సవాల్‌ను నిరూపించుకొన్నారా? అనేది ఈ ట్రైలర్‌లో కనిపించింది.
దర్శకుడు వంశీ రాసుకొన్న కథ మాస్ ఎలిమెంట్స్‌తో కనిపించింది. మాస్ ఎలిమెంట్స్ ఉన్న పాత్రలో రవితేజ పరకాయ ప్రవేశం చేశాడా? అనే విధంగా స్క్రీన్‌పై కనిపించాడు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ఆకట్టుకొనేలా ట్రైలర్‌లో అంశాలు జొప్పించారు. అక్టోబర్ 20వ తేదీన వస్తున్న ఈ సినిమా రవితేజను పాన్ ఇండియా హీరోగా మారుస్తుందా? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











