రామారావుతో కలిసి డ్యూటీ ఎక్కిన టిక్ టాక్ దుర్గారావు.. మామూలుగా లేదుగా!

రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు రోజురోజుకు అదనపు ఆకర్షణలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాలో టిక్ టాక్ స్టార్ కపుల్ దుర్గారావు దంపతులు కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

వరుస సినిమాలతో

వరుస సినిమాలతో

ఈ ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టు అయింది. దీంతో ఆయన వరుస సినిమాలు ఒప్పుకుంటూ అసలు ఏమాత్రం విరామం లేకుండా షూటింగ్ లు జరుపుతున్నారు. ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తూ ఉండగా రమేష్ వర్మకి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

అయితే ఖాళీగా కూర్చోవడం ఎందుకని అప్పటికే ఆయన శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో సినిమా ఫైనల్ చేయడంతో ఆ దర్శకుడితో సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా మీద ఎంతో ఆసక్తి నెలకొని ఉండగా తాజాగా ఈ సినిమాకి రామారావు ఆన్ డ్యూటీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి మరింత ఆసక్తి పెంచారు.

అంచానాలు పెంచేస్తూ

అంచానాలు పెంచేస్తూ

ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారానికి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో సినిమా మీద ఆసక్తి మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఒకప్పటి కామెడీ హీరో వేణు కీలక పాత్రలో నటిస్తున్నాడని రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆ ప్రకటన ఇంకా మరువకముందే ఈ సినిమాలో మరింత అట్రాక్షన్ కూడా ఉండబోతోంది అనే విషయం వెలుగులోకి వచ్చింది.

రామారావుతో దుర్గారావు

రామారావుతో దుర్గారావు

టిక్ టాక్ వీడియోలు ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న టిక్ టాక్ దుర్గారావు ఆయన భార్య ఇద్దరు ఈ సినిమాలో భాగమయ్యారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. క్ టాక్ లో దుర్గారావు నాట్యమండలి పేరుతో రకరకాల ఫన్నీ వీడియోలు చేసిన టిక్ టాక్ దుర్గారావు చాలా ఫేమస్ అయిపోయాడు.

డీ షోలో

డీ షోలో

ముందుగా జబర్దస్త్ వాళ్ళు గుర్తించి అక్కడికి తీసుకు వెళ్లడంతో పాటు డీలో నాది నక్లెస్ గొలుసు అని దుర్గారావు స్టైల్లో పండు డాన్స్ చేయడం కూడా వీరిద్దరికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. అయితే ఒక పక్క షోలలో కనిపిస్తూనే మరోపక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసాడు దుర్గారావు ఈ యూట్యూబ్ ఛానల్ లో ఒకప్పుడు టిక్ టాక్ లో ఎలా అయితే వీడియోలు పెడుతున్నాడో ఇందులో కూడా అలాగే వీడియోలు పెడుతూ అలరిస్తున్నాడు.

Recommended Video

Allu Arjun Got 4.3 Billion views on Tik Tok, King of Social Media
యూట్యూబ్ లో క్రేజ్

యూట్యూబ్ లో క్రేజ్


పెట్టిన కొద్ది రోజులకే ఈ యూట్యూబ్ ఛానల్ కు లక్ష మంది సబ్స్క్రైబ్ అవగా ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగిపోయింది. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దుర్గారావు దంపతులు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సినిమా షూటింగ్ నుంచి కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు పెద్దఎత్తున సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X