Tillu Square Censor Review: టిల్లు స్క్వేర్‌కు షాకింగ్ రిపోర్ట్.. అనుపమ బోల్డ్ అవతారంపై సెన్సార్ బోర్డు ఏమన్
యువ హీరో, హీరోయిన్లు సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్నారు. డీజె టిల్లు సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మార్చి 29వ తేదీన రిలీజ్ అవుతున్నది. దాంతో ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్టు అధికారులు వీక్షించారు. ఈ సినిమాపై వారు వెల్లడించిన అభిప్రాయం విషయానికి వస్తే..
ట్విల్లు స్క్వేర్ సినిమా విషయానికి వస్తే.. డీజే టిల్లు సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో నేహా శెట్టి ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసింది. ఆ సినిమాకు ఆమె పాత్ర ఎంత హైలెట్ అయిందో.. అంతకుమించి ట్విల్లు స్క్కేర్ సినిమాలో అనుపమ క్యారెక్టర్ పోషించి లిల్లీ క్యారెక్టర్‌ను బోల్డుగా చిత్రీకరించారు. దాంతో అనుపమ చేసిన ఆ క్యారెక్టర్‌పై రకరకాల కామెంట్స్ వినిపించాయి.

ట్విల్లు స్క్వేర్ సినిమాలో తొలిసారి తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విధంగా భారీగా అందాల ఆరబోతకు అనుపమ పాల్పడటం చూసి అందరూ షాక్ అయ్యారు. అప్పటి వరకు పక్కింటి అమ్మాయి, గ్లామర్ ఇమేజ్ సొంతం చేసుకొన్న ఈ అందాల భామ బోల్డ్ అవతారం ఎత్తడం చూసి ముక్కున వేలేసుకొన్నారు. తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రాల సినిమాకు మరింత హైప్ పెంచాయి.
విడుదలకు ముందే ఇలా భారీ క్రేజ్ సంపాదించుకొన్న ట్విల్లు స్కేర్ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (సీబీఎఫ్‌సీ) అధికారులు వీక్షించారు. ఈ మూవీని చూసిన తర్వాత డీజే టిల్లు మాదిరిగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఈ సినిమా యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలు ఉన్నాయని వ్యాఖ్యనించినట్టు తెలిసింది.
ఇక టిల్లు స్వ్కేర్ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేస్తూ సెన్సార్ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ సినిమా ఆద్యంతం నవ్వులు పూయింంచేలా ఉందని చెప్పారు. అలాగే కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. వాటిని కరెక్ట్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పినట్టు తెలిసింది. ఇక ఈ సినిమా థియేటర్‌లో డీజే టిల్లు మ్యాజిక్ రిపీట్ చేస్తుందని వెల్లడించారు.

ట్విల్లు స్క్వేర్ సినిమాకు అద్బుతం ఫేమ్ మల్లిక్ రామ్ దర్వకత్వం వహించారు. ఈ సినిమామకు సిద్దూ జొన్నలగడ్డ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫి బాధ్యతలు వహించగా.. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి పాటలకు మ్యూజిక్ చేయగా.. భీమ్స్ సిసిరిలియో బీజీఎం అందించారు.


Click it and Unblock the Notifications











