రిషిగా సూపర్ స్టార్ మహేష్.. డబుల్ ధమాకా రేపే, అర్థరాత్రి హంగామా మొదలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఆగష్టు 9 రేపే. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ధమాకా అందనుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
మహేష్ పాత్ర పేరు ఈ చిత్రంలో రిషి అని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. సినిమా టైటిల్ కూడా అదేనా కదా అనేది చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఫ్యాన్స్ నిరీక్షణకు తెరదించుతూ ఆగష్టు 9 అర్థరాత్రి 12 గంటల 6 నిమిషాలకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ఈ విషయాన్ని ప్రకటించింది.

అర్థ రాత్రి నుంచి ప్రారంభమయ్యే హంగామా రోజంతా కొనసాగనుంది. అర్థరాత్రి ఫస్ట్ లుక్ విడుదల చేయనుండగా ఉదయం 9 గంటల 9 నిమిషాలకు టీజర్ విడుదుల చేయనున్నారు. అంటే మహేష్ బర్త్ డే వేడుకలు ఘనముగా జరగనున్నట్లు తేలిపోయింది. మహేష్ ఈ చిత్రంలో కొత్త లుక్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











