‘ఆ విషయంలో వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు’ పవన్ కళ్యాణ్ పై సింగర్ శైలజ షాకింగ్ కామెంట్స్

Tirumala laddu Row: పవిత్రమైన తిరుమల లడ్డూ మహా ప్రసాదం (Tirupati laddu)తయారీలో కల్తీ జరిగిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. ఈ వివాదంపై భక్తులు, ధార్మిక సంస్థలు మండిపడుతున్నాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతోంది. ఈ తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. స్వామివారి విషయంలో జరిగిన దానికి తాను బాధ్యత వహిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టినట్లు తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కొంతమంది పవన్ కు సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఈ తరుణంలో స్టార్ సింగర్ ఎస్పీ శైలజ (SP Sailaja) పవన్ పై కామెంట్స్ చేసింది.

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తిరుమల స్వామి వారికి జరిగిన ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
అమృతతుల్యంగా, పరమపవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని, జంతు అవశేషాలతో మలీనమైందని, విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tirumala laddu Row Singer Shailaja shocking Comments on Pawan Kalyan

సనాతన ధర్మం గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా తాను ఊరుకోనని పవన్ అన్నారు. తప్పుగా మాట్లాడకపోయినా క్షమాపణలు చెప్పించుకుంటున్నాడు. ఒకసారి హిందూ అంటదు, ఇంకోసారి క్రిస్టియన్ అంటాడు. ఇంతకీ పవన్ కు ఏమైందని కామెంట్స్ చేస్తున్నారు. పవన్ ప్రవర్తనపై కొంతమంది నెటిజన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరూ పెదవి విరుస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ ఎస్పీ శైలజ (SP Sailaja) పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ప్రముఖ సింగర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..' ప్రతి దేశం వారి ధర్మాన్ని పాటిస్తూ.. కానీ మనం సెక్కూలర్ దేశమని అన్ని మతాలను గౌరవిస్తున్నాం. కానీ, మనలో మనకు కొట్లాటలు లేవు. ఎవరి ధర్మం వాళ్లకు ముఖ్యం. సనాతన ధర్మం మన హక్కు. ఆ మార్గంలో నడవాలి. ' అని సింగర్ శైలజ అన్నారు.
'ఇది నా ధర్మం అనుకోని చేస్తున్నారు. ఆయనను మనం వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఆయన మనస్ఫూర్తిగా.. ఇలా చేస్తే నా స్వామికి ప్రక్షాళన కలుగుతుందని నమ్మి ఆ దీక్ష చేపట్టారు' అని సింగర్ శైలజ పేర్కొన్నారు.

'అందులో తప్పేముంది. చేతనమైతే మన సహాయం చేద్దాం. మద్దతుగా నిలబడుదాం. ఇంతకీ తప్పు ఎవరూ చేశారనే విషయం తెలియదు. కానీ, ఆ తప్పుకు ప్రక్షాళన అవుతుందని పవన్ ఇలా చేశారు. అది ఆయన ధర్మం. అన్నారు. 'మనకు చేతనైతే సహాయం చేయాలి. లేకపోతే నిలబడి చూద్దాం.. ఏం జరుగుతుందో వేచిచూడ్డాం. ఇందులో కాంట్రవర్సీ చేయడానికి తావేది? ఏమైనా ఉంటే భగవంతుడు చూసుకుంటాడు'అని పేర్కొన్నారు. ప్రస్తుతం సింగర్ శైలజ వ్యాఖ్లలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X