పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్‌ కౌంటర్.. తిరుపతి లడ్డు వివాదంపై ట్విట్టర్ వేదికగా మాటల యుద్దం

ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వం పవిత్రమైన తిరుపతి లడ్డూకి అపచారం చేయడం అత్యంత వివాదంగా మారింది. కలియుగ పుణ్యక్షేత్రం తిరుమలలోని బాలాజీ భగవతుండి సన్నిధిలో ప్రసాదంగా భావించే లడ్డూలో జంతు మాసం నుంచి తీసిన నూనె, అలాగే ఫిష్ ఆయిల్ కలిపారనే ఫుడ్ సెఫ్టీ సంప్థల నివేదిక బయటకు రావడంతో భక్తులు, హిందువులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ వివాదంపై పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు ప్రకాశ్ రాజ్ ఇచ్చిన వివరణ మరో వివాదానికి దారి తీసింది. ఈ గొడవలో పవన్, ప్రకాశ్ రాజ్ మధ్య జరుగుతున్న మాటల యుద్దం వివరాల్లోకి వెళితే..

ఫుడ్ సెఫ్టీ సంస్థల నివేదిక వెల్లడి తర్వాత పవన్ కల్యాణ్ ట్వీట్ చేస్తూ.. జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూలో వినియోగించారనే విషయంతో కలత చెందాను. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు దీనికి సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం ఇలాంటి అపచారంపై తీవ్రంగా ఖండిస్తున్నది. మేము బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకొంటా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Tirupati Laddu Controversy Actor Prakash Raj counter to Pawan Kalyan

అయితే పవన్ కల్యాణ్‌ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ఈ అపచారం జరిగింది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలోనే. అందుకు బాధ్యులైన నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోండి. అలా కాకుండా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ సమస్యను జాతీయ స్థాయి అంశంగా ఎందుకు చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో రకరకాల మతపరమైన సమస్యలు ఉన్నాయి. జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే దానిపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రకాశ్ రాజ్ నా మీద మాట్లాడారు. హిందువులకు జరిగిన అపవిత్రత గురించి మాట్లాడితే.. ఆయనకేంటి సంబంధం. ఒక్కొక్కరికి పిచ్చి పట్టిందా? ఎవరి కోసం మాట్లాడుతున్నారు. మీరంటే నాకు అపారమైన గౌరవం ఉంది. దానిని కాపాడుకోండి అనే విధంగా నిప్పులు చెరిగారు.

Tirupati Laddu Controversy Actor Prakash Raj counter to Pawan Kalyan

అయితే పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్‌ను చూసిన ఆయన ఘాటుగా స్పందిస్తూ వీడియోను రిలీజ్ చేశారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు.. ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పింది ఏమిటి? మీరు అపార్థం చేసుకొని తిప్పుతున్నదేమిటి? నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. 30 తేదీన తిరిగి వస్తాను. మీ ప్రతీ మాటకు నేను సమాధానం చెబుతాను. ఈ లోపు మీకు వీలైతే.. నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్ధం చేసుకోండి.. ప్లీజ్ అని ప్రకాశ్ రాజ్ వీడియోలో అన్నారు.

ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ నేపాల్‌లో ఓ షూటింగులో ఉన్నారు. తాజాగా తాను షూటింగులో ఉన్నానని ట్వీట్ కూడా చేశారు. ఈ క్రమంలోనే పవన్ చేసిన వార్నింగ్ వైరల్ అయింది. ఆ ప్రెస్ మీట్ చూడగానే ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X