For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Veera Simha Reddy ఆ పాటకు థియేటర్ లో తిరుపతి పూజారి మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్!

  |

  నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఎట్టకేలకు వీర సింహా రెడ్డి సినిమా విడుదలైంది. బాలయ్య బాబు సినిమాతో సంక్రాంతి పండుగ వాతావరణం సాలిడ్ గా మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే ఏ థియేటర్ లో చూసిన జై బాలయ్య నినాదమే. విదేశాల్లో సైతం జై బాలయ్య అరుపులతోపాటు పేపర్లు గాల్లో ఎగురుతున్నాయి. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో ఇవాళ విడుదల కావండో కోట్లాది మంది బాలయ్య అభిమానులు థియేటర్లకు తరలి వెళ్లారు. బాలయ్య బాబు పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ లకు విజిల్స్ వేయడమే కాకుండా పాటలకు స్టెప్పులేస్తున్నారు.

  విదేశాల్లో ఎక్కడ చూసినా..

  విదేశాల్లో ఎక్కడ చూసినా..

  నట సార్వభౌమ, స్వర్గీయ సీనియర్ నందమూరి తారక రామరావు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తనదైన స్టైల్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణను అభిమానులు బాలయ్య బాబు అని ముద్దుగా పిలిచుకుంటారన్న విషయం తెలిసిందే. ఇక ఎక్కడికెళ్లిన.. విదేశాల్లో చూసిన బాలయ్య బాబు క్రేజ్ మాములుగా ఉండదు. జై బాలయ్య అనే నినాదంతో దద్దరిల్లి పోవాల్సిందే.

  బీభత్సమైన క్యూరియాసిటీ..

  బీభత్సమైన క్యూరియాసిటీ..

  ఇక బాలకృష్ణ నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక సినిమా వస్తుందంటే చాలు ఆ చిత్రంపై అంచనాలే కాకుండా అభిమానుల్లో బీభత్సమైన క్యూరియాసిటీ నెలకొంటుంది. దానికి ఒక మాస్ డైరెక్టర్ తోడు అయితే ఇంకెలా ఉంటుంది. అలాంటి భారీ అంచనాలతో మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా తెరకెక్కిన చిత్రమే వీర సింహా రెడ్డి. అఖండ చిత్రంతో బాలకృష్ణ జోరు మీద ఉంటే.. క్రాక్ సినిమాతో గోపిచంద్ మలినేని మంచి హుషారు మీదున్నాడు.

  ప్రధాన బలంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..

  ప్రధాన బలంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..

  హిట్ ట్రాక్ లో ఉన్న గోపిచంద్-బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇటీవల అఖండ సినిమాకు తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్ లో పూనకాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అఖండ చిత్రంలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాకు ప్రధాన బలమని ఎంతో మంది తమన్ ను కొనియాడారు. నెటిజన్లు అయితే ఏం కొట్టావ్ అన్న అని కామెంట్లు కూడా పెట్టారు.

  పూనకాలు తెప్పించిన పాట..

  పూనకాలు తెప్పించిన పాట..


  ఇప్పుడు మళ్లీ అదే తమన్ మ్యాజిక్ క్రియేట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అభిమానులను తెగ ఆకట్టుకుంది. అలాగే సినిమాలోని సుగుణ సుందరి, జై బాలయ్య, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు పాటలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా జై బాలయ్య పాటలో వచ్చే మ్యూజిక్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది.

  షో రద్దు చేసే పరిస్థితి..

  షో రద్దు చేసే పరిస్థితి..


  బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేసిన వీర సింహా రెడ్డి చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా ఎట్టకేలకు ఇవాళ అంటే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను థియేటర్లో చూస్తున్న అభిమానులకు ఒక రేంజ్ లో పూనకాలు వస్తున్నాయి. జై బాలయ్య అంటూ నినాదాలు చేయడమే కాకుండా పేపర్లు చింపి గాల్లోకి ఎగిరేస్తూ తమ అభిమానం చాటుతున్నారు. తాజాగా ఇలా అమెరికాలోని డల్లాస్ లో అభిమానులు హంగామా చేయడంతో అక్కడ షోను రద్దు చేసే పరిస్థితి కూడా ఏర్పడింది.

  పూజారి మాస్ డ్యాన్స్..

  ఇదిలా ఉంటే వీర సింహా రెడ్డిలోని బాలయ్య డైలాగ్ లకు విజిల్స్ వేయడమే కాకుండా సినిమా పాటలకు స్టెప్పులు కూడా వేస్తున్నారు. అందులోనూ తిరుపతికి చెందిన ఓ పూజారి ఏకంగా థియేటర్ లోనే బాలయ్య బాబు పాటకు డ్యాన్స్ చేయడం అందరినీ ఆకర్షించింది. జై బాలయ్య అనే పాటకు ఒంటిపై షర్ట్ లేకుండా అర్థనగ్నంగా ఓ పూజారి ఆకట్టుకునేలా డ్యాన్స్ చేసి అలరించాడు. థియేటర్ లోని మిగతా ప్రేక్షకులు ఆయన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

  English summary
  A Tirupati Priest Dances For Balakrishna Veera Simha Reddy Movie Song Jai Balayya. And This Video Goes Viral In Social Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X