Dilraju: నేను ఆ పని మాత్రమే చేస్తా.. చచ్చే వరకు ఎవరెన్ని చెప్పినా ఆపను!

తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. అద్భుతమైన సినిమాలను నిర్మిస్తున్న టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొఫెషనల్ లైఫ్ లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్న ఈయన.. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈక్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడే షాకింగ్ కామెంట్లు చేశారు. తాను ఆ ఒక్క పని మాత్రమే చేస్తానని.. చచ్చే వరకు ఎవరు చెప్పినా దాన్ని ఆపనంటూ వివరించాడు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. సినీ రంగంపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలిసారి దిల్ సినిమాకు ప్రొడ్యూసర్ గా చేయడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. తన తొలి సినిమా పేరును తన పేరులో పెట్టేసుకున్నారు. అలా దిల్ రాజుగా మారాడు వెంకట రమణా రెడ్డి. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనేక సినిమాలను నిర్మిస్తూ.. కెరియర్ లో సక్సెస్ ఫుల్ దిశగా అడుగులు వేస్తున్నారు.

Title of Family Star Was Not Given to Show Vijay Deverakonda as a Star Dil Raju

ప్రొడ్యూసర్ గా ఎన్నెన్నో హిట్ చిత్రాలు నిర్మిస్తూ.. కోట్ల రూపాయల డబ్బు సంపాదించిన ఈయన తాజాగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాను నిర్మించారు. ముఖ్యంగా ఆశిష్, వైష్ణవీ చైతన్యలు హీరోహీరోయిన్లుగా చేసిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొడ్యూసర్ దిల్ రాజ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం అని.. సినిమాలు నిర్మించడం తప్ప తాను ఇంకో పని చేయలేనని చెప్పుకొచ్చాడు. తన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా వేరే బిజినెస్ చేయాలనిపించదని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ఎవరైనా వేరే బిజినెస్ ల గురించి వివరించే ప్రయత్నం చేసినా తన బుర్రకు ఏమాత్రం ఎక్కదని అన్నాడు. అలాగే తాను ఇంకో పదేళ్లు అయినా, 20 ఏళ్లు అయినా సినిమాలు మాత్రమే నిర్మిస్తానని.. కేవలం ప్రొడ్యూసర్ గానే ఉంటానని స్పష్టం చేశాడు. తాను చచ్చే వరకు సినిమాలు నిర్మిస్తానని.. దీన్ని ఎవరు చెప్పినా ఆపనని క్లారిటీ ఇచ్చాడు.

అలాగే తన వద్దకు ఎవరైనా వచ్చి ఇతర బిజినెస్ ల గురించి చెబితే.. సినిమాల్లో ఏమైనా ఉంటే చెప్పండని చాలా మందికి ఇది వరకే వివరించానంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలపై తనకు ఉన్న ఇష్టం, ఆసక్తి వల్లే తాను సక్సెస్ అయ్యాయని.. తన సక్సెస్ వెనక 20 ఏళ్ల కష్టం ఉందంటూ వెల్లడించాడు ప్రొడ్యూసర్ దిల్ రాజ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X