twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినీ రంగం మోసపూరితమని భయపెట్టారు.. టు ఫ్రెండ్స్ నిర్మాత

    |

    అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు తెలుగు-కన్నడ భాషల్లో సంయుక్తంగా నిర్మించిన సినిమా 'టు ఫ్రెండ్స్'. 'ట్రూ లవ్' అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కొణిజేటి రోశయ్య విడుదల చేశారు. అన్ని రంగాల్లో అసాధారణ విజయాలు సాధిస్తున్న అనంత రాముడు సినిమా రంగంలోనూ అద్భుతాలు సృష్టించాలని ఆయన ఆకాంక్షించారు. ట్రూ లవ్' అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన 'టు ఫ్రెండ్స్' ట్రూ సక్సెస్ సాధించాలని అభిలషించారు.

    ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, వల్లూరిపల్లి రమేష్, ప్రముఖ దర్శకులు బి.గోపాల్, మారుతి, సురేష్ కొండేటి, నారపురెడ్డి, దైవజ్ఞశర్మ తదితరులు పాల్గొన్నారు. తాను నిర్మాతనయ్యేందుకు కారకులైన నారపురెడ్డి మిత్రులు ముళ్లగూరు ఆనంతరాముడుగారు నిర్మాతగా శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకత్వంలో రూపొందిన 'ట్రూ ఫ్రెండ్స్' ఘన విజయం సాధించాలని సి.కళ్యాణ్ కోరుకున్నారు.

    To Friends Theatrical trailer released by former AP CM K Rosaiah

    నిర్మాత ముళ్లగూరు ఆనంతరాముడు మాట్లాడుతూ.. "విద్య, వ్యవసాయం, స్థిరాస్తి, ఫైనాన్స్ వంటి పలు రంగాల్లో విజయాలు సాధించిన తనకు.. సినిమా రంగంలోనూ విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. ముఖ్య మంత్రి హోదాలో తమ అనంత లక్ష్మి ఇంజినీరింగ్ కాలేజీకి వచ్చి ఆశీస్సులు అందించిన రోశయ్య గారు.. టు ఫ్రెండ్స్' థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. సినిమా రంగం మోసపూరితమైనదని అందరూ తనను భయపెట్టారని.. కానీ తనకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదని, భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తానని అన్నారు.

    టు ఫ్రెండ్స్ చిత్రం విడుదలకు సహకరిస్తున్న ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ యువ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. తన కెరీర్ కూడా ఒక చిన్న సినిమాతోనే మొదలయిందని, అనంత రాముడుగారు భవిష్యత్తులో ఎన్నో పెద్ద సినిమాలు తీయాలని అన్నారు. బి.గోపాల్ చిత్ర యూనిట్ కి అల్ ది బెస్ట్ చెప్పారు.

    పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

    తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'ఆనంతరాముడుగారు వంటి గట్స్ ఉన్న నిర్మాతల అవసరం ఇండస్ట్రీకి ఉందన్నారు. ఈ సినిమా చూశానని, దర్శకుడు శ్రీనివాస్ సినిమాను అద్భుతంగా తీర్చి దిద్దారని.. 'టు ఫ్రెండ్స్' చిత్రాన్ని రెండు రాష్ట్రాల్లో రెండు వందలకు పైగా ధియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

    దర్శకుడు శ్రీనివాస్ జి.ఎల్.బి మాట్లాడుతూ.. "ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు అందించిన సహాయ సహకారాల వల్ల సినిమా చాలా బాగా వచ్చింది" అన్నారు.
    ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్రానికి కథ, మాటలు, సంగీతం సమకూర్చిన పోలూర్ ఘటికాచలం, హీరో అఖిల్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

    ధనరాజ్, స్నిగ్ధ, సమీర్ దత్త, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, సాయిప్రకాష్, సాధు కోకిల, కవిత, రమేష్ భట్, డి.వై.రఘురాం, చిత్ర శెనాయి, శ్రీలక్ష్మి, కృష్ణవేణి, వై.విజయ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్-వరికుప్పల యాదగిరి-డి.వై.రఘురాం, కొరియోగ్రఫీ: స్వర్ణబాబు, కో-డైరెక్టర్: నాగుల జగన్నాధ్, పీఆర్వో: ధీరజ అప్పాజీ, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, కథ-మాటలు-సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ముళ్ళగూరు వెంకటేష్ నాయుడు, నిర్మాతలు: ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్ జి.ఎల్.బి

    English summary
    To Friends movie is produced under Anantha Lakshmi Creations. Mullaguru Anantha Ramudu, Mullaguru Ramesh Naidu are producers. This Theatrical trailer released by former AP CM K Rosaiah.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X