నా కంటే ముందు పుట్టి.. ఎన్టీఆర్‌పై రాఘవేంద్ర రావు కామెంట్

నేడు(మే 20) నందమూరి అభిమానుల పండగ రోజు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ రోజు. హరికృష్ణ మరణం కారణంగా ఎన్టీఆర్ తన పుట్టిన రోజు వేడుక జరుపుకోనని ముందుగా చెప్పినప్పటికీ నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఇంటికి తరలి వచ్చారు. ఇక మరోవైపు అభిమానులతో పాటు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు వెల్లువలా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలునుతున్నారు. ఈ మేరకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు.. ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ తనదైన శైలిలో కామెంట్ చేశారు.

''నాకంటే మూడు రోజుల ముందే పుట్టిన రోజు జరుపుకుంటున్న మా నందమూరి తారక రాముడికి జన్మదిన శుభాకాంక్షలు. స్టూడెంట్, సింహాద్రి, ఆది, దయ, వీర రాఘవ అయినా, రేపు రాబోయే కొమరం భీమ్ అయినా, నీ నటనతో కొన్ని దశాబ్దాలు గుర్తుండిపోయేలా చేస్తున్నావు. ఇంకెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నాను'' అంటూ రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు రాఘవేంద్ర రావు.

Today may 20 N. T. Rama Rao Jr birth day. Birth day wishes are heavily comes from fans and other heroes. Senior director Raghavendra Rao wished ntr..

1983 వ సంవత్సరం మే 20 వ తేదీన జన్మించిన తారక్ ఈ రోజు 36వ ఏట అడుగుపెట్టారు. బాలనటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన బాలరామాయణంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి.. స్టూడెంట్ నెం.1తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నారు ఎన్టీఆర్.

More from Filmibeat

Read more about: birthday
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X