దర్శక, నిర్మాతలతో విభేదాలు .. టాలీవుడ్ ఫైట్ మాస్టర్ షాకింగ్ కామెంట్స్

రామ్ లక్ష్మణ్ .. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి వచ్చి చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ కవలలు. పెద్దగా చదువుకోకపోయినా, తమ కష్టం , ప్రతిభతో ఈ స్థాయికి చేరుకున్నారు ఈ అన్నదమ్ములు. తెలుగులో నా ఇల్లే నా స్వర్గం అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన వీరు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలకు, స్టార్ హీరోలకు స్టంట్ మాస్టర్స్‌గా పనిచేసి శెభాష్ అనిపించుకున్నారు.

ఇండస్ట్రీకి ఎంతో మంది ఫైట్ మాస్టర్స్ వచ్చినా.. మాకు రామ్ - లక్ష్మణ్ కావాలనే స్టార్లు ఎందరో. అందరితో సరదాగా ఉండటంతో పాటు ఉన్నతమైన వ్యక్తిత్వం వీరిని అందరివాళ్లుగా చేసింది. తమకు చేతనైనంత సాయం చేస్తూ ఎంతో మందిని ఆదుకున్నారు రామ్ - లక్ష్మణ్. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫి విభాగంలో ఆరు నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలను అందుకున్నారు.

Tollywood action choreographers ram lakshman made sensational comments on why not getting offers

కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌ నగర శివార్లలోని అజీజ్ నగర్‌లో రామ్ - లక్ష్మణ్ టీమ్ ఓ సినిమా కోసం ఫైట్స్ రిహార్సల్స్ చేస్తోంది. ఇంతలో కుక్కలు ఏడుస్తుండటం గమనించిన ఈ అన్మదమ్ములు అక్కడికెళ్లి చూడగా.. ఓ పెద్ద బండరాయి మధ్యలో చిక్కుకుపోయిన తల్లి కుక్క, దాని పక్కనే తల్లి కోసం తల్లడిల్లిపోతున్న 10 కుక్క పిల్లలు కనిపించడంతో వారిద్దరూ తల్లడిల్లిపోయారు. ఆ బండరాళ్లలో నుంచి కుక్కను రక్షించాలని వారు ఎంతో ప్రయత్నించారు. కానీ వల్ల కాకపోవడంతో జేసీబీని రప్పించి దాని సహాయంతో కుక్కను కాపాడి దానిని పిల్లల చెంతకు చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. రామ్ లక్ష్మణ్‌లను పలువురు ప్రశంసించారు.

అయితే వీరిద్దరిని ఇండస్ట్రీ దూరం పెడుతుందనే వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాకు పనిచేసిన వీరు పుష్ప 1కి వర్క్ చేయలేదనే వార్తలు వచ్చాయి. పీటర్ హెయిన్స్, డ్రాగన్ ప్రకాష్‌లు పుష్ప 2లో మేజర్ స్టంట్ సీన్స్‌ని కాంపోజ్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొత్త వారు వస్తున్నారు కాబట్టి, మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారని తాము బాధపడటం లేదని తెలిపారు.

మేం ఊహించిన దానికంటే ఇండస్ట్రీ మాకు ఎంతో ఇచ్చిందని ఈ కవలలు తెలిపారు. ప్రేరు, ప్రఖ్యాతులు ఎండమావుల వంటివని.. భగవంతుడు ఇచ్చిన దానిని అనుభవించాలని, అంతేకానీ ఇంకా కావాలని పరిగెత్తకూడదని రామ్ లక్ష్మణ్ సూచించారు. మాకు దక్కాల్సిన ఛాన్స్ పోయిందని బాధపడటం లేదని.. అది మా కంటే ఎక్కువ అవసరంలో ఉన్న వారికి వెళ్లి ఉంటుందని ఆనందిస్తామని తెలిపారు. ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: ram lakshman tollywood movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X