AP Elections 2024 పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ బంధం అలాంటిదే.. 30 ఇయర్స్ పృథ్వీ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నా.. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమస్ అయ్యారు పృథ్వీ. ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా పిల్లలు, పెద్దలు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. తనైదన కామెడీ టైమింగ్, డిక్షన్‌తో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయ్యారు పృథ్వీ. ముఖ్యంగా గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన లౌక్యం సినిమాలో తన కామెడీ పంచ్‌లతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు.

సినిమాలలో బిజీగా ఉంటూనే రాజకీయాలపై ఆసక్తితో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయనతో కలిసి నడిచారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున విస్తృతంగా ప్రచారం చేసి జగన్ కంట్లో పడ్డారు. ఈ క్రమంలోనే పృథ్వీ సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు ఏకంగా ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు సీఎం. అయితే లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పృథ్వీ తనకు తానుగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు.

tollywood actor 30 years prudhvi praised janasena chief pawan kalyan

వైసీపీకి సైతం రాజీనామా చేసిన పృథ్వీ.. బయటికి వచ్చిన తర్వాత ఆ పార్టీని, నేతలను తీవ్రంగా విమర్శించేవారు. ఆపై జనసేన పార్టీలో చేరి తన వాణిని బలంగా వినిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి అభ్యర్ధుల తరపున పృథ్వీ విస్తృతంగా ప్రచారం చేసి వైసీపీ నేతలు చేసిన విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. మొన్నామధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌లపై స్టార్ యాంకర్ శ్యామల చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చారు పృథ్వీ.

ఇదిలావుండగా .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఏ విషయంలోనైనా పవన్ '' సై అంటే సై '' అనేలా ఉంటారు. ప్రజల కోసం, ఏపీ అభివృద్ది కోసం ఆయన తీవ్రంగా తపిస్తున్నారు. ఏపీ కోసం ఎంతవరైకాన వెళ్తారు అని చెప్పారు.

tollywood actor 30 years prudhvi praised janasena chief pawan kalyan

పవన్ కళ్యాణ్ ఏ బోర్డ్‌లో మెంబర్ కాదని, కనీసం వార్డ్ మెంబర్ కూడా కాదని కానీ ఆయనలో ఉన్న సిన్సియారిటీ, హానెస్టీ చూసి దేశానికి ప్రధాని అయిన నరేంద్ర మోడీ నరసరావుపేటలో జరిగిన బహిరంగసభకు వచ్చారని థర్టీ ఇయర్స్ పృథ్వీ చెప్పారు. దటీజ్ ద పవర్ ఆఫ్ కొణిదెల పవన్ కళ్యాణ్ అంటూ తమ అధినేతను ఆకాశానికెత్తేశారు.

పేదలకు ఏదైనా చేయాలనే పవన్‌లోని తపనను మోడీ గుర్తించారని , జనంలోంచి వచ్చిన వారే నిజమైన లీడర్ అని పృథ్వీ వ్యాఖ్యానించారు. కోట్లు పెట్టి బీ ఫారంలు కొనుక్కునేవాడు లీడర్ కాదని.. అతను పక్కా కమర్షియల్ అని, అయితే ఎమ్మెల్యే లేకుంటే ఎంపీ మాత్రమేనని పృథ్వీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X