twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం: ప్రముఖ యాక్టర్ కమ్ డైరెక్టర్ కన్నుమూత

    |

    కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు పలు కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి ప్రభావంతో మరికొంత మంది చనిపోయారు. దీంతో రెండేళ్లుగా వరుసగా సినీ నటులు, టెక్నీషియన్లు ఇతర ప్రముఖుల మరణాలతో పరిశ్రమకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా టాలీవుడ్‌లో మరొకరు ప్రాణాలు విడిచారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

    చాలా కాలం పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా, నటుడిగా విశిష్ట సేవలు అందించిన గిరిధర్ ఆదివారం తిరుపతిలోని తన స్వగృహంలో తుది శ్వాసను విడిచారు. 64 ఏళ్ల ఈయన.. ఆరు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో గిరిధర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి ఆయన మంచానికే పరిమితం అయిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా గిరిధర్ ఆరోగ్యం క్షిణించింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఆయన ఇంట్లోనే కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈయన మరణంపై సినీ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

    Tollywood Actor, Director Giridhar Passes Away

    సినిమాల మీద ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన గిరిధర్.. ఆరంభంలో సీనియర్ దర్శకులు కోదండ రామిరెడ్డి, ఈవీవీ సత్యనారాయణ, గుణ శేఖర్ వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో 'గుడుంబా శంకర్', 'అన్నవరం', '1 నేనొక్కడినే', 'సుప్రీమ్', 'వరుడు' వంటి చిత్రాలకు తెర వెనుక నుంచి పని చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడిగా మారి 'శుభ ముహూర్తం' అనే సినిమాను తీశారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయినప్పటికీ ఆయన మరో సినిమాను మాత్రం తెరకెక్కించలేదు. కానీ, నటుడిగా మారారు.

    Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్.. మీసం తిప్పిన స్టార్ హీరో.. గెస్ట్ చైర్‌లో ఉన్న ప్రముఖుడు ఎవరంటే!Evaru Meelo Koteeswarulu సెట్స్‌లో తారక్.. మీసం తిప్పిన స్టార్ హీరో.. గెస్ట్ చైర్‌లో ఉన్న ప్రముఖుడు ఎవరంటే!

    సుదీర్ఘమైన కెరీర్‌లో 'సర్ధార్ గబ్బర్ సింగ్', '100% లవ్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శ్రీమంతుడు' సహా 20 సినిమాల్లో నటించారు. అప్పుడప్పుడే బిజీగా మారుతున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో అప్పటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా తుది శ్వాసను విడిచారు. తాజా సమాచారం ప్రకారం.. ఈరోజు తిరుపతిలో ఆయన అత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.

    English summary
    Tollywood director Giridhar passed away on Sunday at his residence. who was seriously injured in a road accident six years ago, has since been confined to bed. He breathed his last at his residence in Tirupati yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X