నితిన్ తో ఘోర అవమానం... కన్నీళ్లు పెట్టుకున్న నటుడు..!
టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ తనదైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీ లతో అదరగొట్టిన నితిన్ ప్రస్తుతం మాత్రం ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో దూసుకెళ్తున్నారు. గతంలో జయం, దిల్, సై, శ్రీ ఆంజనేయం, ఇష్క్, గుండెజారి గల్లంతయింది, అఆ.. వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకొని చిత్ర పరిశ్రమలో తనకంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. చివరిగా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో నటించిన చిత్రం ' భీష్మ' కూడా మంచి విజయాన్ని సాధించి పెట్టింది. కానీ ఆ తర్వాత వచ్చిన చిత్రాలు మాత్రం ఘోర పరాజయాన్ని మిగిల్చాయి.
చివరిగా నితిన్ నుంచి వచ్చిన ఐదు చిత్రాలు డిజాస్టర్ గా మిలాయి. నితిన్ అభిమానులు ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. నెక్స్ట్ చిత్రంతో నితిన్ ఎలాగైనా తన అభిమానులను ఫిదా చేయడంతో పాటు ఆడియన్స్ కు కూడా పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దీంతో మళ్లీ తన హిట్టు డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి మళ్లీ మ్యాజిక్ చేయడానికి రాబోతున్నారు. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకున్న చిత్రమే 'రాబిన్ హుడ్'. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా హీరోయిన్ గా నటించింది. మార్చి 28న విచిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్గా రిలీజ్ కాబోతోంది.

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. కాగా నాని ప్రొడ్యూస్ చేసిన 'కోర్టు' మూవీ రీసెంట్ గా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో నటుడు, రైటర్ హర్షవర్ధన్ నితిన్ పై షాకింగ్ కామెంట్ చేశారు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎక్కడ మచ్చలేని నితిన్ పై ఆయన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రియదర్శి హీరోగా నటించిన ' కోర్టు' మూవీ ఈవెంట్ లో నానిని చూస్తూ నటుడు హర్షవర్ధన్ నితిన్ పై ఈ కామెంట్లు చేశారు.
కోర్టు ఈవెంట్లో హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ఓ ఫంక్షన్ లో తనను హీరో అవమానించాడని చెప్పాడు. అయితే ఆ హీరో ఎవరో కాదు నితిన్ అంటూ పేరును బయటపెట్టారు. నితిన్ కు సంబంధించిన ఓ సినిమా ఫంక్షన్ లో వేదికపై నుంచి నితిన్ తన పేరుతో హర్షవర్ధన్ అంటూ పిలిచారని చెప్పారు. తను లేచి వేదిక పైకి వెళుతుండగా మరో వ్యక్తి తనకంటే ముందే వెళ్తున్నారని చెప్పారు. అయితే ఆయన పేరు కూడా హర్షవర్ధన్ కావడం తనని ఆశ్చర్యపరిచిందంట. ఆ సినిమాకు రైటర్ గా పని చేసినప్పటికీ హర్షవర్ధన్ వేదిక పైకి పిలవకపోవడం కాస్త బాధించిందని చెప్పారు.
ఆ తర్వాత నితిన్ ను కలిశాక ఇదే విషయంపై మాట్లాడారంట. మీరు ఏంటి వేదిక పైకి రాలేదంటూ అనడంతో.. పిలిస్తే వస్తామండి పిలవకుండా ఎలా రాగలను అంటూ హర్షవర్ధన్ బదులిచ్చాడంట. ఆ సమయంలో కాస్త బాధపడ్డాను అంటూ తన ఫీలింగ్ ను వ్యక్తం చేశారు. వేదిక పైకి వచ్చి మాట్లాడే రోజులు మీకు కూడా వస్తాయని నితిన్ బదులిచ్చారంట. వేదిక పైకి వచ్చి మీరు కూడా మాట్లాడే అవకాశం వస్తుందని, అప్పుడు మీకు ఎన్ని విషయాలు గుర్తు ఉంటాయో, ఏం మాట్లాడతారో తెలుస్తుంది అని కూడా అన్నారని చెప్పారు. అయితే హర్షవర్ధన్ ఏ ఉద్దేశంతో చెప్పారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఏదేమైనా హర్షవర్ధన్ మాటలు మాత్రం నెట్టింట వైరల్ గా మారాలి. సంబంధించిన వీడియోలను కూడా నెట్టిజెన్లు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే రాబిన్ హుడ్ చిత్రంలో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ ఐటెం సాంగ్ తో ఆకట్టుకోబోతోంది. మరోవైపు స్టార్ క్రికెటర్ వార్నర్ డేవిడ్ కూడా ఈ చిత్రంతోనే సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇటీవల డేవిడ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 60 కోట్లు బడ్జెట్ తో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











