For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సైలెంట్‌గా హీరో కార్తికేయ నిశ్చితార్థ వేడుక.. అమ్మాయి ఎవరంటే?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కొంతమంది యువ హీరోలు సరైన వయసు లోనే పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. చాలా వరకు హీరోలు కెరీర్ సెట్ చేసుకోవాలనే ఆలోచనలతో పెళ్లి చేసుకోవడానికి పెద్దగా ధైర్యం చేయడం లేదు. ముఖ్యంగా మూడు పదుల వయసు దాటినా కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కానీ మరికొందరు మాత్రం ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి అని మ్యారేజ్ లైఫ్ ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ లిస్టులో మరొక హీరో కూడా చేరబోతున్నాడు. అతడు మరెవరో కాదు. యువ టాలెంటెడ్ హీరో కార్తికేయ. గత కొంతకాలంగా వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న కార్తికేయ మొత్తానికి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అయితే గత రాత్రి సైలెంట్ గా నిశ్చితార్థ వేడుకలు జరుపుకోవడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ గా మారింది.

  ఆ ఒక్క సినిమాతోనే..

  ఆ ఒక్క సినిమాతోనే..

  హీరో కార్తికేయ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హీరోగానే కాకుండా పాత్ర నచ్చితే విలన్ రోల్స్ చేయడానికి కూడా ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. హీరోగా కంటే కూడా మంచి నటుడిగానే గుర్తింపు అందుకోవాలని అని ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాడు. 2017లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమా ద్వారా పరిచయమైన కార్తికేయ ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ ఒక్క సినిమాతోనే ఈ యువహీరో కెరీర్ కు సరిపోయిందా క్రేజ్ అందుకున్నాడు. నేటితరం యూత్ లో కూడా అతనికి మంచి క్రేజ్ అయితే ఏర్పడింది.

  పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తికేయ

  పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కార్తికేయ

  ఇక ఇటీవల కార్తికేయ పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో వాళ్లకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే నితిన్, నిఖిల్, రానా దగ్గుబాటి పెద్దగా గ్యాప్ లేకుండా పెళ్లి చేసుకోవడం ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వారికి సంబంధించిన పెళ్లి ఫోటోలు కూడా సోషల్ వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఇక ఇప్పుడు యువ హీరో కార్తికేయ కూడా బ్యాచిలర్ లైఫ్ కు తుది వీడ్కోలు పలికే విధంగా అడుగులు వేస్తున్నాడు.

   ఆ అమ్మాయి ఎవరంటే..

  ఆ అమ్మాయి ఎవరంటే..

  కార్తికేయకు గత కొంత కాలంగా పెళ్లి సంబంధాలు గట్టిగానే వస్తున్నాయట. యువహీరోకు పెళ్లి చేయాలని వారి తల్లిదండ్రులు కూడా చాలాకాలంగా ఎదురుచూస్తున్నారట. నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న కార్తికేయకు మొత్తానికి లక్కీ గర్ల్ దొరికిందట. కార్తికేయ సన్నిహితుల కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. పెద్దలు కూడా వారికి పెళ్లి చేయాలని చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  సైలెంట్ గా పూర్తి చేసుకున్న కార్తికేయ

  సైలెంట్ గా పూర్తి చేసుకున్న కార్తికేయ

  ఇక ఆదివారం రోజు పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్ గా నిశ్చితార్థ వేడుకలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు సంబంధించిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఫోటోలో కార్తికేయ తనకు కాబోయే భార్య తో సంతోషంగా స్టిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి వేడుకకు సినీ సెలబ్రిటీలు పెద్దగా ఎవరూ హాజరు కాలేదని సమాచారం. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థ వేడుకను సింపుల్ గా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై యువ హీరో కార్తికేయ అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

  Kartikeya's 90ML Trailer | Neha Solanki | Sekhar Reddy Yerra | Anup Rubens | #90MLTrailer
  మెగాస్టార్ పుట్టినరోజున..

  మెగాస్టార్ పుట్టినరోజున..

  తనకు అత్యంత ఇష్టమైన హీరో చిరంజీవి జన్మదినం రోజే తన ఎంగేజ్‌మెంట్ వేడుకను జరుపుకోవడం విశేషంగా మారింది. ఇటీవల చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ఓ అవార్డుల ఫంక్షన్లో కార్తీకేయ ఎమోషనల్‌గా ఫీలయైన సంగతి తెలిసిందే. మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన పాటలకు స్టెప్పులు వేయడమే కాకుండా తన మాటలతో మెగాస్టార్ మనసును తాకేలా చేశాడు. అందుకు మెగాస్టార్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక మెగాస్టార్ పుట్టినరోజున కార్తికేయ జీవితంలో ఎంతో ముఖ్యమైన నిశ్చితార్థం వేడుకను కూడా సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.

  English summary
  Young Tollywood actor Kartikeya Gummakonda Engaged,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X