Krishnam Raju అంత్యక్రియలు పూర్తి.. తలకొరివి ఎవరు పెట్టారంటే..

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణవార్త సినీ లోకాన్ని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. ఆదివారం తెల్లవారు జామున కన్నుమూసిన కృష్ణంరాజు మరణించడం సినిమా పరిశ్రమకు తీరని లోటుగా సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అంతిమయాత్రలో సినీ ప్రముఖులు అభిమానులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. మొత్తానికి కృష్ణంరాజుకి ఇష్టమైన ప్రదేశంలోనే అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఆదివారం కన్నుమూత

ఆదివారం కన్నుమూత

పలు అనారోగ్యా సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న కృష్ణంరాజు పరిస్థితి ఆదివారం రోజు విషమించడంతో కన్నుమూశారు. ఆయనకు షుగర్ తో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా ఉండడంతో వైద్యులు చివరి నిమిషం వరకు ఆయనను రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు కానీ అప్పటికే బాడీ సహకరీంచకపోవడంతో ప్రాణాలు విడిచారు.

స్టార్స్ నివాళి

ఇక ఆదివారం రోజు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు కృష్ణంరాజు ఇంటి దగ్గర ప్రత్యేకంగా నివాళులర్పించారు. ఆయన లోటు ఎవరు తీర్చలేనిది అంటూ స్టార్ హీరోలు బావిద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, మోహన్ బాబు అలాగే మరికొందరు యువ హీరోలు కూడా కృష్ణంరాజుకు నివాళులర్పించారు.

అంతిమయాత్ర

అంతిమయాత్ర

సోమవారం ఉదయం కృష్ణంరాజు అంతిమయాత్ర ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైంది. బీఎన్‌ఆర్‌ కాలనీ బ్రిడ్జ్, గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్‌, అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌కు అంతిమయాత్రను కొనసాగించారు. కనకమామిడి ఫాంహౌస్‌లో కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు అందరూ కూడా ముందే నిర్ణయించారు.

తలకొరివి పెట్టిన ప్రభాస్ సోదరుడు

కృష్ణంరాజు భౌతికకాయం ఫామ్ హౌస్ కు చేరుకోగానే అప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఇక ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణంరాజు కు అంత్యక్రియలు జరిగాయి. ప్రభాస్ సోదరుడు ప్రబోధ్ ప్రత్యేకంగా తన పెదనాన్నకు హిందూ సంప్రదాయ ప్రకారం తలకొరివి పెట్టారు. ఇక రెబల్ స్టార్ అభిమానులు అక్కడికి కూడా భారీగా తరలివచ్చారు వారి అభిమాన హీరోకు ఫ్యాన్స్ అందరూ కడసారి వీడ్కోలు పలికారు.

 ఇష్టమైన ప్రదేశంలోనే అంత్యక్రియలు

ఇష్టమైన ప్రదేశంలోనే అంత్యక్రియలు

ఇక కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రత్యేకంగా ఫామ్ హౌస్ లోనే చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే అక్కడే కృష్ణంరాజు ఉండాలని అనుకున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఇంటి నిర్మాణం కూడా ఇటీవల మొదలుపెట్టారు. అక్కడే వ్యవసాయం చేయిస్తూ ప్రకృతిలో ఆయన కొన్నాళ్లు రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే కృష్ణంరాజు తనువు చాలించారు. ఇక ఆయనకు ఎంతో ఇష్టమైన ఆ ఫామ్ హౌస్ లోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X