మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా పాజిటివ్.. కోవిడ్19ను జయిస్తానని ట్వీట్
మెగా బ్రదర్, నిర్మాత, నటుడు నాగబాబు కరోనావైరస్ బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనావైరస్ పాజిటివ్ అని నాగబాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ రావడంపై సానుకూలంగా స్పందించి ట్వీట్ చేశారు.
తనకు కరోనాపాజిటివ్ అని తేలిన తర్వాత నాగబాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇన్‌ఫెక్షన్ అన్నివేళలా బాధపట్టకపోవచ్చు. ఆ ఇన్‌ఫెక్షన్ మనకు తోటి వారికి సహాయపడే అవకాశం కల్పిస్తుంది. నాకు కరోనావైరస్ పాజిటివ్. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకొని.. ప్లాస్మా డోనర్‌గా ఇతర పేషెంట్లకు సహాయపడుతాను అని నాగబాబు కొణిదెల అన్నారు.

ఇప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి కుటుంబం కరోనావైరస్ బారిన పడింది. వారు స్వీయ గృహ నిర్బంధం పాటించిన కరోనాను జయించారు. అనంతరం హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్వహిస్తున్న ప్లాస్మా డోనర్ క్యాంపుకు వెళ్లి పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ సమక్షంగా ప్లాస్మాను దానం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రారంభించిన ప్లాస్మా డోనేషన్ కార్యక్రమానికి సాధారణ ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. కరోనావైరస్ పేషెంట్లకు ప్లాస్మా ద్వారా చికిత్సను అందించే అవకాశం కల్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











