ఏపీ సీఎం జగన్‌ను అందుకే కలిశా.. క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా కొంత మంది పెద్దలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులతో చర్చలు జరిపేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ముఖ్యంగా అగ్రహీరోలు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అధికార పార్టీ సభ్యులు అలాగే మంత్రులతో కూడా ఇండస్ట్రీ సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. అయితే ఇటీవల అక్కినేని నాగార్జున కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో ఒక్కసారిగా మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆయన ఎందుకు కలిశారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి ఇక ఫైనల్ గా నాగార్జున మీడియా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.

లాక్ డౌన్ లో అలా కలిసిన నాగ్
అక్కినేని నాగార్జున చాలా వరకు తన పని తాను చేసుకుంటూ కూల్ గా కనిపిస్తూ ఉంటారు. ఇతర విషయాల్లో కి అలాగే వివాదాస్పద ఘటనలపై కూడా ఎక్కువగా స్పందించారు. కేవలం లాక్ డౌన్ సమయంలో ఇండస్ట్రీ సమస్యలపై చర్చలు జరిపేందుకు సినీ పెద్దల తో కలిసి రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలిశారు. షూటింగ్స్ కోసం ప్రత్యేక అనుమతులు అలాగే థియేటర్స్ ను త్వరగా ఓపెన్ చేయించాలని కూడా నాగార్జున అప్పట్లో తన మద్దతు ఇచ్చారు.

అప్పట్లో స్టూడియో కోసం..
ఆ విధంగా లాక్ డౌన్ లో నాగార్జున మొదటిసారి ఇండస్ట్రీ తరపున వచ్చాడు. అయితే గతంలో కొన్నిసార్లు రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులను నాగార్జున ప్రత్యేకంగా కలుసుకున్నారు కేవలం ప్రత్యేకంగా మర్యాదపూర్వకంగానే కలిసినట్లు వివరణ కూడా ఇచ్చారు. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా స్టూడియో కోసం చర్చలు జరిగినట్లు కూడా టాక్ అయితే వచ్చింది.

అందుకే కలిశాను
ఇక గురువారం రోజు నాగార్జున జగన్మోహన్ రెడ్డిని కలవడంపై అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ విషయం పై అనుమానాలు ఎక్కువ కాక ముందు నాగార్జున తనదైన శైలిలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. జగన్ నాకు అత్యంత శ్రేయోభిలాషి.. అంటూ ఆయనను చూసి చాలా రోజులు అవుతుంది అందుకే విజయవాడ కు రావడం జరిగింది.. అని అన్నారు.

జగన్ తో లంచ్
అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్ తో కలిసి లంచ్ కూడా చేశాను అని చెప్పిన నాగార్జున చాలా రోజుల తర్వాత విజయవాడ రావడం ఆనందంగా ఉంది అని వివరణ ఇచ్చారు. ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా నాగార్జునతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నాగార్జున ఇండస్ట్రీలోని పలు అంశాలపై చర్చలు జరపడానికే జగన్ ను కలిసినట్లు పలు మీడియాల్లో కథనాలు వెలువడినప్పటికి ఆ విషయంలో మాత్రం నాగ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం.
Recommended Video

ఆ విషయాలపై కూడా చర్చలు
మరికొన్ని రోజుల్లో పెద్ద సినిమాలు కూడా రాబోతున్నాయి. అయితే ఆ సినిమాలకు అనుకూలంగా ఉండేలా బెనిఫిట్ షోలకు కూడా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై కూడా ఏపీ ప్రభుత్వం కొత్త జీవోను తీసుకు వస్తుండడం పై కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయాన్నింటిపైనా కూడా నాగార్జున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తో చర్చించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











