నానికి నచ్చలేదట.. ఆ హీరోతో మల్టీస్టారర్ క్యాన్సిల్ అయినట్లేనా?
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల జోరు రోజురోజుకి ఊపండుకుంటోంది. మల్టీస్టారర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో స్టార్ హీరోలు మోహమాటం లేకుండా వేరే హీరోలతో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా కాలం తరువాత మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

అప్పటి నుంచే ఈ జోరు..
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమా నుంచి టాలీవుడ్ లో మల్టీస్టారర్ కథలు ఎక్కువగా పూట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకొని అభిమానులకు మంచి కిక్కిచ్చాడు. ఇక అదే తరహలో మిగతా హీరోలు కూడా మల్టీస్టారర్ లో నటించే అవకాశం వస్తే ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు.

నాని కూడా అదే బాటలో..
న్యాచురల్ స్టార్ నాని కూడా స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికే ఏ మాత్రం వెనుకాడటం లేదు. కెరీర్ మొదట్లో రైడ్ సినిమా ద్వారా తనీష్ తో కలిసి నటించిన నాని ఆ తరువాత దేవదాస్ అనే సినిమా ద్వారా నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. త్వరలోనే మరొక స్టార్ హీరోతో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

నాని మల్టీస్టారర్ క్యాన్సిల్ అయ్యిందా?
అసలైతే గత ఏడాది నాని ఒక మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ డైరెక్షన్ లో నాని, తమిళ్ హీరో విశాల్ కలిసి ద్విభాషా చిత్రాన్ని చేయబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే మళ్ళీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూస్ బయటకు రాకపోవడంతో క్యాన్సిల్ అయ్యిందని టాక్ వస్తోంది.

నానికి నచ్చలేదట?
మరొక రూమర్ ప్రకారం.. నాని ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కథ నచ్చకపోవడంతో కథ చెప్పిన కొన్ని రోజులకు ఆలోచించుకొని నో చెప్పాడట. అయితే ఇది ఎంతవరకు నిజం అనే విషయంలో క్లారిటీ రాలేదు. కానీ మల్టీస్టారర్ కథలు తన దగ్గరకు వస్తే మాత్రం నాని చేయాలనే తపనతో ఇష్టంగానే వింటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











