‘పవిత్ర నాకు ఆ సంతోషం ఇవ్వడం లేదు.. ఎన్ని సార్లు అడిగినా’.. నరేశ్ ఓపెన్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్న అలనాటి నటి విజయ నిర్మల - కృష్ణల కొడుకుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. 1982 నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే నరేష్ పలు విషయాల్లో వివాదాలను కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా తన మూడు పెళ్లిల విషయంలో తీవ్రంగా విమర్శలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నటి పవిత్రా లోకేష్ తో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నరేష్ తన భార్య పవిత్రా లోకేష్ పై చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే..
తెలుగులో నరేష్ గుర్తుండిపోయే సినిమాలు..
45 ఏళ్లుగా నరేష్ తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. అంతకంటే ముందే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఆయన కెరీయర్ ప్రారంభంలో హీరోగా రెండు జెళ్ల సీత, శ్రీవారికి ప్రేమ లేఖ, శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, మనసు మమత, చిత్ర భళారే విచిత్రం, జంబ లకడి పంబ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2000 ప్రారంభం నుంచి ఆయన సపోర్టింగ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నరేష్ 100% లవ్, యముడికి మొగుడు, దృశ్యం, బీరువా, గడ్డం గ్యాంగ్, భలే భలే మొగాడివోయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గుంటూరు టాకీస్, హైపర్, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, భీష్మ, సోలో బ్రతుకే సో బెటర్, టక్ జదీష్ వంటి చిత్రాల్లో తన పాత్రల ద్వారా నవ్వులు పూయించారు.

పవిత్రా లోకేష్ తో నాలుగో వివాహం..
పవిత్రా లోకోష్ తో నరేష్ 4వ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా తర్వాత 2023లో నరేష్ కన్నడ నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే నరేష్ డ్యాన్స్ మాస్టర్ కూతురును, ఆ తర్వాత రేఖా సుప్రియాను, ఆ తర్వాత రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరందరితో ఒక్కొక్క కొడుకును కూడా జన్మనించారు. రెండేళ్ల కింద మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చి పవిత్రా లోకేష్ తో జీవనం సాగిస్తున్నారు.
పవిత్రా లోకేష్ పై నరేష్ షాకింగ్ కామెంట్స్...
నరేష్ పవిత్రా లోకేష్ కు సంబంధించిన వివాదం అందరికీ తెలిసిందే. బెంగళూరులో పెద్ద ఘర్షణ తర్వాత వీరిద్దరు ఒక్కటయ్యారు. అయితే వీరిద్దరూ ఎట్టకేళలకు ప్రస్తుతం కలిసి జీవిస్తున్నారు. పైగా కలిసి ఓ చిత్రంలోనూ నటించారు. ఇటీవల నరేష్ పవిత్రా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. పవిత్రాను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నరేష్ కు ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదంట. తనతో మాత్రం ఐ లవ్ యూ అని చెప్పించుకుంటుందని, కానీ నరేష్ కు మాత్రం ఒక్కసారి కూడా చెప్పలేదని తానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో ట్రెండ్ అవుతోంది.
నటి పవిత్రా లోకేష్ తో సినిమా..
నరేష్ సీనియర్ నటి పవిత్రా లోకేష్ తో నాలుగో పెళ్లి చేసుకున్న తర్వాత 'మళ్లీ పెళ్లి' అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. ఈ చిత్రం 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన తల్లి విజయ నిర్మల స్థాపించిన విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై తానే ప్రొడ్యూసర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ప్రస్తుతం ఇద్దరు తమకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











