రవితేజకు పితృవియోగం.. 90వ ఏట కన్నుమూసిన తండ్రి.. చిరంజీవి పరామర్శ
మాస్ మహారాజా రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. రవితేజ తండ్రి తాజాగా కన్నుమూశారు. మంగళవారం రాత్రి మాస్ మహారాజా తండ్రి తుది శ్వాస విడిచారు. రవితేజ తండ్రి పేరు రాజగోపాల్ రాజు. ఆయన వయసు 90 ఏళ్లు. ఇన్నాళ్లు ఎంతో యాక్టివ్ గా ఉన్న ఆయన వయస్సు పైబడటంతో కొన్నాళ్లుగా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక తాజాగా శరీరం సహకరించకపోవడంతో కన్ను మూశారు. రవితేజ తండ్రి మరణించిన వార్త తెలుసుకుని మాస్ మహారాజా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికన తన తండ్రి మరణానికి నివాళి అర్పిస్తున్నారు.
రవితేజ తండ్రి గురించి..
రవితేజ తండ్రిది ఏపీలోని జగ్గంపేట. ఆయన అక్కడే పుట్టి పెరిగారు. తూర్పు గోదావరి జిల్లాలో నివసించారు. ఆయన పూర్తిపేరు భూపతిరాజు రాజగోపాల్ రాజు. ఫార్మసిస్ట్ గా పని చేశారు. రవితేజ తల్లి పేరు భూపతిరాజు రాజ్య లక్ష్మి ఆమె ఇంట్లోనే ఉంటుంది. వీరికి ముగ్గురు సంతానం. అందులో పెద్దవాడు రవితేజ. భరత్ రాజు, రఘు ఇద్దరు తమ్ముళ్లు. వీరూ కూడా నటులుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ తండ్రి ఎక్కువ కాలం ముంబైలో పనిచేశారు. దాంతో అమితాబ్ బచ్చన్ సినిమాలు చూసి నటుడు కావాలనే ఆసక్తి పుట్టింది. ఆ తర్వాత రవితేజ తండ్రి విజయవాడకు షిఫ్ట్ అయ్యాక పూర్తిగా సినిమాల్లోకి వచ్చాడు.

తమ్ముడిని కోల్పోయి..
రవితేజ ఇంట్లో ప్రస్తుతం విషాద ఛాయలు ఉన్నాయి. తన తండ్రి చనిపోవడంతో రవితేజ శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక ప్రస్తుతం ఆయన అంతిమ యాత్రకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే రవితేజ తమ్ముడు, నటుడు భరత్ రాజ్ 8 ఏళ్ల కిందనే చనిపోయిన సంగతి తెలిసిందే. 2017లో కారు ప్రమాదంలో మరణించాడు. అప్పట్లో కుటుంబం మొత్తం విషాదంలో మునిగి పోయింది. ఇక భరత్ మరణం తర్వాత తల్లిదండ్రులను రవితేజనే చూసుకుంటున్నారు.
చిరంజీవి సంతాపం..
రవితేజ తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 'సోదరుడు రవితేజ తండ్రి రాజ గోపాల్ రాజు గారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన్ని ఆఖరిసారిగా వాల్తేర్ వీరయ్య సెట్లో కలిశాను. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.' అని ఎక్స్ ద్వారా నివాళి అర్పించారు. మరోవైపు రవితేజ అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని సన్నిహితులు రవితేజను కలిసి పరామర్శిస్తున్నారు. పెద్దాయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.
రవితేజ పర్సనల్ లైఫ్..
రవితేజకు 2002లో కల్యాణితో వివాహం అయ్యింది. 2002 మే 26న వీరిద్దరూ దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. రవితేజ భార్య వెస్ట్ గోదావరి జిల్లాలోని గన్నవరంకు చెందినది. వీరికి ఇద్దరు సంతానం. కూతురు మోక్షద, కొడుకు మహాదన్ ఉన్నారు. ఇప్పటికే మహదన్ రాజా ది గ్రేట్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను వెండితెరపై పలకరించాడు. ఇక మోక్షద ప్రొడ్యూసర్ గా కెరీయర్ ను ప్రారంభిస్తోంది. అందుకు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటోంది. నెక్ట్స్ రవితేజ మాస్ జాతర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


Click it and Unblock the Notifications











