ఆ స్టార్ హీరోయిన్ తో సాయి ధరమ్ తేజ్ పెళ్లి.. మెగా ఫ్యామిలీ క్లారిటీ

By Lekhaka

మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన మరో టాలెంటెడ్ యాక్టర్ సాయి ధరమ్ తేజ్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యకత చాటుకుంటున్నారు. తన మేనమామల పేరుతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నాడు. తన సినిమాల బడ్జెట్ ను క్రమంగా పెంచుకుంటూ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే జవాన్ సినిమాలో తనతో జతకట్టిన మెహ్రీన్ తో పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారంపై సాయి ధరమ్ తేజ్ టీం క్లారిటీ ఇచ్చింది.

తక్కువ కాలంలో సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. మెగస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనల్లుడైనప్పటికీ, మేనమామలకు మచ్చ తీసుకురావద్దని జాగ్రత్త పడుతుంటాడు సాయి. తన నటన, డ్యాన్స్ తో మెగా హీరో అని నిరూపించుకున్నాడు. ఈ మధ్య యాక్సిడెంట్ కావడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత అదే ఎనర్జీతో సాయి ధరమ్ తేజ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ తర్వాత వచ్చిన విరూపక్ష సినిమాతో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఇంతకుముందు కంటే సాయి ధరమ్ తేజ్ సినిమాల బడ్జెట్ పెరిగిందని సిని పరిశ్రమలు వినిపిస్తోంది. అందుకే కొన్ని క్రేజీ ప్రాజెక్టులతో కేరీర్ లో బీజీగా ఉన్నాడు.

Tollywood actor sai dharam tej team gave clarity on marriage news

సినిమాల్లో జోడీగా నటించిన హీరోయిన్లోతో లింక్ పెట్టడం ఇండస్ట్రీలో సర్వసాధారణం. అయితే జవాన్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మెహ్రీన్ తో ఫ్రెండ్ షిప్ కుదిరిందని, ఫ్రెండ్ షిప్ కాస్త పెళ్లి వరకు దారి తీసిందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ సాయి ధరమ్ తేజ్ టీం మాత్రం అవి కేవలం పుకార్లు మాత్రమేనని ఆ వార్తలను కొట్టి పారేసింది. పెళ్లికి సంబంధించి ఏమైనా ఉంటే తాము అధికారికంగా చెప్తామని పేర్కొంది. అప్పటి వరకు ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని టీం సభ్యులు కోరారు.

మంచి కథ ఉంటే కొత్త దర్శకులకు కూడా అవకాశం ఇచ్చేందుకు సాయి ధర్మ లేజ్ వెనకాడరని ఇండస్ట్రీలో టాక్. తన కేరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ రోజు రోజుకు తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. దీంతో అభిమానులు కూడా భారీ పెరుగుతున్నారు. కథలో కొత్తదనం కోసం ప్రాధాన్యత ఇస్తూ స్టోరీలు ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో సాయి తేజ్ నటిస్తున్నారు. ఈ సినిమాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అంతే కాకుండా సాయి ధరమ్ తేజ్ నెక్ట్స్ సినిమా 120 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.

Tollywood actor sai dharam tej team gave clarity on marriage news

మెగా ఫ్యామిలీలో అన్ని శుభవార్తలే వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. విశ్వంభర వంటి భారీ బడ్జెట్ సినిమాతో చిరంజీవి బీజీగా ఉన్నారు. దీంతో వారి వెసులుబాటును చూసుకొని సాయి ధరమ్ తేజ్ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాలనే ఆలోచనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Read more about: sai dharam tej marriage
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X