Bigg Boss Telugu 7: శివాజికి ఇద్దరు కాకుండా ముగ్గురు పిల్లలా?.. ఇంతకాలం సీక్రెట్‌గా ఎందుకంటే.. లీక్ చేసిన
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సీజన్ లో కంటెస్టెంట్లుగా వచ్చిన అందరి గురించి తెలుగు ప్రేక్షకులు బాగా తెలుసుకుంటున్నారు. కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలు కూడా తీసుకుంటున్నారు. వారి ఫ్యామిలీ బాగ్రౌండ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన శివాజి అంటే అందరికీ ఇష్టమే. 50 ఎళ్ల వయసు కల్గిన ఆయన అద్భుతమైన ఆట తీరుతో అందిరనీ అలరిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో పెద్దన్నగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
మొదటి వారం నుంచి ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే మొహం మీదే చెప్పేస్తున్నారు. ఇలా సీరియల్ బ్యాచ్ వాళ్లకు శత్రువుగా మారిన ఈయన మాత్రం.. కామన్ మాన్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్లకు చాలా దగ్గరయ్యాడు. మొదటి నుంచి వీళ్లిద్దరితో మంచి బంధం ఏర్పరుచుకని.. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వారికి అన్ని రకాలుగా అండగా ఉంటూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురి బంధానికి ప్రతీకగానే స్పై బ్యాచ్ ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాచ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ముఖ్యంగా శివాజి మరింతగా లైక్ చేస్తూ తమ ఇంట్లోని సొంత అన్నలా భావిస్తున్నారు.

ఇంత చక్కగా గేమ్ ఆడుతున్న శివాజికి ఇద్దరు పిల్లలు మాత్రమే అని అందరికీ తెలుసు. ముఖ్యంగా వారిద్దరూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చారు. పదో వారంలో భాగంగా పెద్ద కుమారుడు వెంకట్ వచ్చాడు. డాక్టర్ లా వచ్చి అందరికీ షాకిచ్చాడు. అదే వారం బిగ్ బాస్ స్టేజీపైకి చిన్న కుమారుడు వచ్చాడు. తన తల్లితో కలిసి వచ్చి హౌస్ లోని అందరిపై పంచులు వేశాడు. ఇలా ఇద్దరు కుమారులు బిగ్ బాస్ హౌస్ కి రావడంతో శివాజికి ఇద్దరు కుమారులు, అందమైన భార్య ఉందని అందరికీ తెలిసిపోయింది. అయితే వాస్తవానికి శివాజికి ఇద్దరు పిల్లలు కాదంట. ముగ్గురు పిల్లలు ఉన్నారంట. అయితేఈ విషయాన్ని ఆయన క్లోజ్ ఫ్రెండ్ టాలీవుడ్ నటుడు సమీర్ యే చెప్పుకొచ్చారు.
అయితే నటుడు సమీర్ తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతూ చాలానే విషయాలు చెప్పుకొచ్చారు. కావాలనే బిగ్ బాస్ అమర్ దీప్ అండ్ గ్యాంగ్ ను సేవ్ చేస్తూ వస్తుందని తెలిపారు. అలాగే స్పై బ్యాచ్ అయిన... శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు చాలా చక్కగా గేమ్ ఆడుతున్నారని.. తన సపోర్ట్ అంతా వీళ్లకే అని చెప్పుకొచ్చారు. అయితే యాంకర్.. శివాజి శోభాశెట్టిపై చేసిన కామెంట్లు తీసి అలా అనడం తప్పే కదా మీరు దాన్ని సపోర్ట్ చేస్తున్నారా అని అడిగారు. దానికి సమీర్ అవును సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పారు. దానికి కారణం కూడా వివరించారు.

శివాజికి నిజంగా ఓ కూతురు ఉందని.. ఆమె తప్పు చేసినా అతడు అలాగే బిహేవ్ చేసేవాడని వివరించాడు. అంతలోనే యాంకర్ ఏంటి శివాజి గారికి కూతురు ఉన్నారా అని అడగ్గా.. అవును ఉందంటూ పదే పదే చెప్పాడు సమీర్. ఇలా శివాజికి కూతురు ఉందనే విషయాన్ని సమీర్ తొలిసారిగా బయట పెట్టారు. అయితే ఇంత కాలం శివాజి ఈ విషయాన్ని వెల్లడించలేదు. ముఖ్యంగా వెల్లడించే అవకాశం రాలేదనుకోవచ్చు. చూడాలి మరి బిగ్ బాస్ ఫైనల్స్ రోజు అయినా.. శివాజి కూతురు స్టేజీపైకి వస్తుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











