బొమ్మరిల్లు సినిమాను ఆ పెద్దాయన అవమానించాడు.. స్టేజీపైనే కడిగేసిన సిద్ధార్థ్

టాలీవుడ్ స్టార్ నటుడు, హ్యాండస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. చెన్నైలో పుట్టి పెరిగిన సిద్ధార్థ్ తెలుగు సినిమాలతోనే నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ఇప్పటికీ తన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇంట్రెస్టింగ్ చిత్రాలను ఆడియెన్స్ ను అందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 3 BHK అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మూవీని గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ బొమ్మరిల్లు సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత జరిగిన ఒక వివాదం గురించి చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో గుర్తుండిపోయే చిత్రాలు..
హీరో సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో మంచి మంచి ప్రాజెక్ట్స్ దక్కాయి. బొమ్మరిల్లు చిత్రంతో సిద్ధార్థ్ ఆయన తెలుగులో చేసిన డైరెక్ట్ ఫిల్మ్ నువ్వొస్తానంటే నేనొద్దనంటానా, చుక్కల్లో చంద్రుడు, బొమ్మరిల్లు, ఆట, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావా, అనగనగా ఓ ధీరుడు, జబర్దస్త్, మహా సముద్రం, వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఇందులో బొమ్మరిల్లు చిత్రం ఎంతో గుర్తింపుని ఇచ్చింది. సిద్ధార్థ్ కెరీయర్ లోనే ఆ సినిమా భారీ సక్సెస్ ను అందించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం రూ.6 కోట్ల తో రూపుదిద్దుకొని రూ.50 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టింది. దిల్ నిర్మించిన ఈ చిత్రానికి భాస్కర్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం విశేషం.

Tollywood Actor Siddharth Revealed Bommarillu Movie Controversy

బొమ్మరిల్లును సినిమాపై అలాంటి కామెంట్స్..
ప్రస్తుతం సిద్ధార్థ్ తన రాబోయే చిత్రం 3 బీహెచ్ కే ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో సినిమాను ఇక్కడ కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సిద్ధార్థ్ హాజరయ్యారు. తన బొమ్మరిల్లు చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ మూవీ సక్సెస్ ఈవెంట్ లో జరిగిన ఓ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు.

'బొమ్మరిల్లు చిత్రం సక్సెస్ అయిన తర్వాత 30 నుంచి 40 స్టేజీ మీట్స్ నిర్వహించాం. అప్పుడు ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్దాయన బొమ్మరిల్లును చిన్న సినిమా అంటూ సంబోధించారు. దాంతో నాకు కోపం వచ్చింది. చిన్న సినిమా ఏంటీ, పెద్ద సినిమా ఏంటీ సార్. సినిమాను అలా అవమానించకండి అంటూ స్టేజీపైనే మైక్ తీసుకొని చెప్పాను. సినిమా ఏదైనా సినిమానే' అని చెప్పుకొచ్చారు. సిద్ధార్థ్ అలా మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక 3 BHK సినిమా ప్రమోషన్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.

3 BHK మూవీ వివరాలు..
తమిళ భాషలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ డ్రామా 3 BHK. ఈ చిత్రాన్ని శ్రీ గణేశ్ డైరెక్ట్ చేశారు. సిద్దార్థ్, ఆర్ శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. శాంతి టాకీస్ బ్యానర్ లో అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు. అమృత్ రామ్నాథ్ సంగీతం అందించారు. జూలై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Read more about: siddharth bommarillu 3 BHK
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X