తక్కువ చేసి చూస్తే తుక్కు రేగిపోద్ది.. పవన్ కళ్యాణ్ విషయంలో సుమన్ ఫైర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజకీయ పరంగానూ 2024 శాసన సభ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు. అయితే పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల పాటు పార్టీని నడుపుతూ పొలిటీషన్ గా మార్చేందుకు రాత్రింభవళ్లు కష్టపడ్డారు. అయితే గతే ఎన్నికల్లో కాస్తా బలంగా నిలుచున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఆయన ముందు నిల్చునే స్థాయి లేని వారు కూడా నానా మాటలు అన్నారు. అయితే తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ వారందరిపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభంజనం..
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రజలకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 2018 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకున్నారు. అప్పుడు జనసేనా పార్టీకి ఘోర పరాజయం మిగిలింది. కానీ అప్పుడు ప్రజల తీర్పును గౌరవించిన పవన్ కళ్యాణ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనా పార్టీ నుంచి 21 స్థానాల్లో నిల్చొని అన్ని చోట్ల గెలుపొందారు. 2 ఎంపీ స్థానాలను కూడా దక్కించుకున్నారు. ఇలా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీగా పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించారు. ఇక ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా ప్రజలకు మెరుగైన పాలనను అందించేందుకు కృషి చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే ఊరుకోం..
తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ ఏపీ రాజకీయాలపై స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ గతంలో కొంత మంది సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎందుకు? మీకు రాజకీయంగా ఎం అనుభవం ఉంటుంది? ప్రజలకు మీరు సరైన పాలన అందించగలరా? అంటూ విమర్శించారు.
ఇప్పటికే చిత్ర పరిశ్రమ నుంచి ఎంజీఆర్, జయలలిత, సీనియర్ ఎన్టీఆర్ సీఎం హోదాలో పాలన చేశారనే సంగతిని విమర్శించే వారు గుర్తుంచుకోవాలి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లు సరైన పాలన అందిస్తామని రుజువు చేశారు. పవన్ కళ్యాణ్ పాలనలో ఏదైనా లోటు ఉంటే నేరుగా చెప్పాలి కానీ, ఆయనపై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోమని చెప్పుకొచ్చారు.
పెండింగ్ సినిమాలపైనా దృష్టి..
రాజకీయంగా ప్రభంజనం సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ తన సినిమాలపై ఫోకస్ పెట్టారు. గతంలో సైన్ చేసి షూటింగ్ మధ్యలోనే ఆపేసిన చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేస్తున్నారు ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ వంటి చిత్రాల షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో అడుగు పెట్టారు. వరుసగా 40 రోజుల పాటు షూటింగ్ జరగనుంది.


Click it and Unblock the Notifications











