Don't Miss!
- News
mother: కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకున్న తల్లి, అంగన్ వాడి టీచర్ ఇంట్లో ?
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Rajinikanth's Jailer లో విలన్‌గా సునీల్.. కేక పెట్టించిన లుక్.. రెమ్యునరేషన్ ఎంతంటే?
టాలీవుడ్ కమెడియన్ గా సునీల్ ఒకప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తర్వాత హీరోగా మారి కొంతకాలం పాటు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే హీరోగా అనుకున్నంతగా సక్సెస్ లు రాకపోవడంతో మళ్లీ విలన్ గా ప్రయత్నాలు చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. ఇక డిఫరెంట్ గా నటించాలి అని విలన్ పాత్రలు కూడా చేశాడు. ముఖ్యంగా పుష్ప సినిమాలో అయితే అతనికి మంచి గుర్తింపు లభించింది.
అందులో మంగళం శ్రీను కనిపించిన విధానం సినిమాకు ఎంతగానో హెల్ప్ అయింది. అయితే ఆ సినిమా తర్వాత సునీల్ కు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ అతను తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న పాత్రలను చేయాలి అని సెలెక్ట్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో అతనికి విలన్ గా నటించే అవకాశం లభించింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ జైలర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఆ సినిమాలో సునీల్ పవర్ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడు. రజనీకాంత్ తో కొన్ని యాక్షన్స్ సీన్స్ లో కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక పాత్ర కోసం అతను దాదాపు మూడు కోట్లకు పైగానే పారితోషికం కూడా తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సునీల్ కు తమిళ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి. పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా సునీల్ పాత్ర మరింత హైలెట్ కాబోతుందట.

ఇక జైలర్ సినిమాలో సంబంధించిన షూటింగ్ ఇంకాస్త పూర్తి కావాల్సి ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో తెలుగు తమిళంలో ఒకేసారి విడుదల చేయబోతున్నారు. అలాగే సునీల్ రాబోయే మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక టాక్ అయితే వినిపిస్తోంది. ఇక సోలో హీరోగా కూడా అతను చిన్న బడ్జెట్లో మరి కొన్ని సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.