స్టార్ హీరోపై నటి ప్రగతి షాకింగ్ ఆరోపణలు.. తనతో గడిపితేనే ఆఫర్ ఇస్తానన్నారంటూ!

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా మారిన తర్వాత ఆమె వరుసగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె లైంగిక వేధింపుల వ్యవహారం మీద నోరువిప్పి సంచలనంగా మారింది అలాగే మళ్లీ వార్తల్లోకెక్కింది.. ఆ వివరాల్లోకి వెళితే

తళుకుబెళుకులు చూసి

తళుకుబెళుకులు చూసి

ఒకరకంగా సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. పైకి కనపడే తళుకుబెళుకులు చూసి సినిమాల్లో మెరిసిపోదామని వచ్చే వారిలో నూటికి తొంబై శాతం మంది సక్సెస్ కాలేరు. ఆ పది శాతం మంది కూడా సక్సెస్ సాధించే వరకు ఎన్నో అవమానాలను ఎదుర్కోక తప్పదు. మరీ ముఖ్యంగా స్త్రీల విషయం ఇంకా దారుణం. వాళ్ళను చూసిన వెంటనే కొందరికి క్యాస్టింగ్ కౌచ్ మాత్రమే గుర్తు వస్తుంది.

ప్రగతి కూడా

ప్రగతి కూడా

కెరీర్ లో ఏదో ఒక సందర్భంలో తాము అనుభవించిన చేదు అనుభవాలను అంతా అయిపోయిన తరువాత బయటపెడుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కొన్నేళ్ల క్రితం మీటు అంటూ పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పుడు కూడా అడపాదడపా ఎవరో ఒకరు తాము లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని చెబుతూనే ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటి ప్రగతి కూడా కెరీర్ మొదట్లో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ విషయం బయటపెట్టింది.

హీరో నుంచి వేధింపులు

హీరో నుంచి వేధింపులు

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక స్టార్ హీరో తనను లైంగికంగా వేధించాడని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. . తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అని, ఓ దశలో దర్శక నిర్మాతలే కాకుండా హీరో నుంచి వేధింపులు ఎదురయ్యాయి అని వెల్లడించారు. ఒక స్టార్ హీరో అయితే... రోజంతా తనతో గడిపితే అవకాశం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు అని తెలియజేసింది.

 రాత్రి గడిపితే అవకాశం

రాత్రి గడిపితే అవకాశం

"నేను కెరీర్ ని ప్రారంభించినప్పుడు అవకాశాల కోసం దర్శక, నిర్మాతల వద్దకు వెళ్ళినప్పుడు వారు ఒక రాత్రి గడిపితే అవకాశం దక్కుతుంది'' అని అన్నారు. తన సినిమాలో అవకాశం కావాలంటే దర్శక నిర్మాతలతో పాటు తనతో కూడా గడపాలని కోరాడు కానీ నేను దానికి ఒప్పుకోలేదని ఆమె వెల్లడించారు. అయితే లైంగిక వాంఛ తీర్చమని కోరిన సదరు స్టార్ హీరో ఎవరనేది ప్రగతి బయటపెట్టలేదు. నిజానికి ప్రగతి కెరీర్ హీరోయిన్ గా మొదలైంది. ఆమె కొన్ని తమిళ చిత్రాలలో హీరోయిన్ గా చేశారు.

Recommended Video

Salman Khan Responded On Rumors That He Is Casting Actors For SKF
సినిమాల విషయానికి విషయానికి

సినిమాల విషయానికి విషయానికి


తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అమ్మ, వదిన, అత్త పాత్రల్లో నటిస్తూ బిజీగా వున్న ప్రగతి లాక్‌డౌన్‌లో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. అప్పటి నుంచి తరచూ ఫిటినెస్‌ వీడియోలతో పాటు పలు డాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా పుష్ప సినిమాలో సమంత ఐటెం సాంగ్ అయిన ఊ అంటావా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి కేక పెట్టించారు. ఇక ప్రగతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X