Surekha Vani: అలాంటి జీవితం కోసమే గుండు కొట్టించుకున్నా.. రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్లు
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ, నటి సురేఖా వాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ నటిగా సినిమాలు చేస్తూనే ఉంది. అయితే ఈమె సినిమాల్లో కనిపించడం కంటే కూడా సోషల్ మీడియాలో, వార్తల్లోనే ఎక్కువ కనిపిస్తుంటుంది. అయితే ఇటీవలే గుండు కొట్టించుకుని షాక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలిసారి తాను ఎందుకు గుండు కట్టించుకుందో కూడా వివరించింది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ముఖ్యంగా అమ్మగా, అక్కగా, పిన్నిగా, వదినగా.. ఇలా అద్భుతమైన క్యారెక్టర్లలో కనపించింది నటి సురేఖా వాణి. ముందుగా టీవీలో కనిపించిన ఈమె.. తన భర్త డైరెక్టర్ కావడంతో సినిమాల్లోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి సినిమాల్లోనే కొనసాగుతూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ వస్తోంది. అయితే నాలుగేళ్ల క్రితం ఈమె భర్త డైరెక్టర్ తేజ చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఒంటరిగానే కూతురుని పోషిస్తూ జీవనం సాగిస్తోంది.

ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత కూడా తాను బొట్టు పెట్టుకోవడం, మోడ్రన్ గా కనిపించడం.. కూతురుతో కలిసి ఎంజాయ్ చేయడంతో అనేక మంది వీరిపై నెగిటివ్ కామెంట్లు చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్లు చేసింది. తరచుగా కాంట్రవర్శీల అవుతూ తనకు మనశ్శాంతి లేకుండా పోతుందని.. ఇదంతా తనకు అస్సలే నచ్చలేట్లదని తెలిపింది. కానీ ఇదంతా తాను చేస్తున్నది కాదని.. కావాలనే కొందరు తమపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్తపై తనకు ఎంత ప్రేమ ఉందని బయటి వాళ్లకు తెలియకపోవచ్చని.. కానీ ఆయనంటే తనకు ప్రాణం అని వివరించింది. అలాగే తాను అస్సలే రెండో పెళ్లి చేసుకోనని క్లారిటీ ఇచ్చింది. గతంలో ఆయనను ప్రేమించినప్పుడు.. ఆయనతో పెళ్లి జరిగితే గుండు కొట్టించుకుంటానని తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నట్లు చెప్పింది. పెళ్లయ్యాకా... తాను కెరియర్ లో చాలా బిజీగా ఉన్నా మొక్క ప్రకారం గుండు కొట్టించుకున్నట్లు వివరించింది. అయితే తాజాగా మరోసారి గుండు కొట్టించుకోవడానికి గల కరాణాలను కూడా వివరించింది.

అయితే రెండోసారి.. ఇప్పుడు గుండు కొట్టించుకోవడానికి కారణం మాత్రం తన జీవితం హాయిగా సాగాలని.. ఎలాంటి కాంట్రవర్శీలకు గురి కాకుండా జీవితం సాఫీగా సాగాలనే ఇలా చేయించుకున్నానని నటి సురేఖా వాణి క్లారిటీ ఇచ్చింది. ఆ దేవుడిని మొక్కుకుని గుండు కొట్టించుకున్న తర్వాత తన జీవితం హాయిగా సాగుతుందని.. తన భర్త లేని లోటు తప్ప మరే బాధలు లేవని చెప్పుకొచ్చింది. ఆ దేవుడి దయ వల్ల కలలో అయినా సరే తన భర్తతో ఓ పది నిమిషాలు మాట్లాడి.. తనలోని బాధను తీర్చుకోవాలని ఉందని వివరించింది.


Click it and Unblock the Notifications











