సీక్రెట్‌గా వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరో, నటుడు శరత్ కుమార్ వారసురాలిగా సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. కానీ గతకొంత కాలంగా మాత్రం అదిరిపోయే పాత్రల్లో నటిస్తూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. ఇటీవలే హనుమాన్ చిత్రంలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఎవరికీ తెలియకుండా ఎంగేజ్ మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వరలక్ష్మీ శరత్ కుమార్ 2012లో పోదా పోడి అనే తమిళ సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టింది. ఆ తర్వాత అనేక చిత్రాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. అనుకున్న స్థాయిలో హీరోయిన్ గా సక్సెస్ సాధించకపోవడంతో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మారిపోయింది. ఇక అప్పటి నుంచి అనేక అద్భుతమైన సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫల్ క్రేజ్ సంపాధించుకుంది.

ప్రస్తుతం 38 ఏళ్ల వయసు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. గతంలో ఈ ముద్దుగుమ్మ పలువురు హీరోలతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తోందంటూ పెద్ద ఎత్తునే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా హీరో శింబుతో పాటుగా విశాల్ తో ఈమె ప్రేమాయణం సాగిస్తోందని టాక్ నడిచింది. దీనిపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా పుకార్లు షికార్లు చేస్తూనే వచ్చాయి. కానీ తాజాగా ఆమె ఎవరికీ చెప్పకుండా ఎంగేజ్ మెంట్ చేసుకుంది. అయితే అందరూ అనుకున్నట్లుగా ఈమె ఈ హీరోలతో కాకుండా మరో వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది.
ఆర్ట్ గ్యాలరీ యజమాని నికోలాయ్ సచ్‌దేవ్ తో వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్లికి సిద్ధం అయింది. ముఖ్యంగా మార్చి 1వ తేదీ ముంబైలోని ఓ హోటల్ లో వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ఈ వేడుక జరగగా.. తాజాగా ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, నికోలాయ్ సచ్ దేవ్ లకు.. 14 ఏళ్లుగా స్నేహం ఉందని తెలుస్తోంది. ఈక్రమంలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటి కావాలనుకోవడం.. కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పడంతో వీరి పెళ్లి చేసుకోబోతున్నారు. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











