twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. సినీతారల సందడి

    |

    పెళ్లి అన్నాక హంగు, ఆర్బాటాలు, నెల ముందు నుంచే పెద్ద ఎత్తున ఏర్పాట్లు లాంటివి కామన్. కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉంటూ సైలెంట్‌గా పెళ్లి చేసుకొని షాకిచ్చింది టాలీవుడ్ హీరోయిన్ మనాలి రాథోడ్. ఓ వ్యాపారవేత్తను పెళ్లాడింది. ఈమె పెళ్లి వేడుక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి పోతే..

    పెళ్లి పీటలెక్కుతున్న అందాల భామలు

    పెళ్లి పీటలెక్కుతున్న అందాల భామలు

    ఈ మధ్యకాలంలో యంగ్ హీరోయిన్స్ అందరూ వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే శ్రీయ లాంటి సీనియర్ హీరోయిన్ పెళ్లి చేసుకొని ఓ ఇంటి ఇల్లాలు కాగా, ఇటీవలే అందాల తార అర్చన కూడా పెళ్లి చేసుకొని ఓ ఇంటి కోడలుగా మారింది. ఇప్పుడు ఇదే బాటలో మరో టాలీవుడ్ హీరోయిన్ మనాలి రాథోడ్ పయనించింది.

    పారిశ్రామికవేత్తతో పెళ్లి.. రాజశేఖర్ దంపతులు, హేమ

    పారిశ్రామికవేత్తతో పెళ్లి.. రాజశేఖర్ దంపతులు, హేమ

    కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సైలెంట్ అయిన మనాలీ.. వ్యాపారవేత్త రవి విజ్జిత్‌ని పెళ్లి చేసుకుంది. ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తతో హైదరాబాద్‌లో ఈమె వివాహం జరిగింది. ఈ వేడుకకు రాజశేఖర్, జీవిత, హేమ, క్రిష్ లాంటి పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు.

    సోషల్ మీడియాలో మనాలీ.. బికినీ ఫోటోస్ షేర్ చేస్తూ

    సోషల్ మీడియాలో మనాలీ.. బికినీ ఫోటోస్ షేర్ చేస్తూ

    సోషల్ మీడియాలో కూడా మనాలీ రాథోడ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోల్ని నెట్‌లో అప్‌లోడ్ చేస్తూ ప్రెకషకులను మైమరిపించడం ఈ ముద్దుగుమ్మ నైజం. బికినీ ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఇన్నాళ్లూ తన కెరీర్‌ని అలా నెట్టుకొచ్చిన మనాలీ.. ఇప్పుడు పెళ్లి చేసుకొని లైఫ్‌లో సెటిల్ అయిపోయింది.

    మనాలీ రాథోడ్‌ సినీ జర్నీ..

    మనాలీ రాథోడ్‌ సినీ జర్నీ..

    ''నేను లోకల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, హౌరా బ్రిడ్జ్‌, ఎంఎల్‌ఏ, ఓ స్త్రీ రేపు రా'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హైదరాబాదీ బ్యూటీ మనాలీ రాథోడ్‌. ఆ తర్వాత కోలీవుడ్ వెళ్లిన ఈ భామ అక్కడ కొన్ని ఫ్లాప్ సినిమాలతో డీలా పడింది. చూడాలి మరి పెళ్లి తర్వాత మనాలీ రాథోడ్‌ సినీ జర్నీ కొనసాగుతుందా? లేదా? అనేది.

    English summary
    Hyederabad beauty Manali Rathod got married with businessman Vijith. In this event Hema, jeevithaRajashekar attended.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X