Puneeth Rajkumar: భయంకరమైన విషాదం.. పునీత్ మృతిపై ఆర్జీవి షాకింగ్ ట్వీట్.. మెగాస్టార్, మహేష్ ఎమోషనల్!
కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నటువంటి పునీత్ రాజ్ కుమార్ హటాత్తుగా కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంతో ఆరోగ్యంగా కనిపించే పునీత్ రాజ్ కుమార్ నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ ఉంటాడు.
అలాంటి హీరోకు గుండెపోటు రావడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రాముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. దర్శకులు స్టార్ హీరోలు కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వివరణ ఇచ్చారు.

రామ్ గోపాల్ వర్మ
పునీత్ రాజ్ కుమార్ యొక్క ఆకస్మిక మరణం అనే దిగ్భ్రాంతికరమైన విషాదమే. అంతే కాకుండా మనలో ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు అనేది భయంకరమైన విషయం. ఇదొక భయంకరమైన నిజం కాబట్టి మనం ఉన్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో జీవించడం ఉత్తమం అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి
నిజంగా ఇది షాకింగ్. హృదయ విదారక ఘటన. పునీత్ రాజ్ కుమార్ చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి మరియు కన్నీటి సానుభూతి తెలియజేస్తున్నాను. మొత్తంగా కన్నడ , భారతీయ చలనచిత్ర రంగానికి ఇది తీరని నష్టం.. అంటూ ఈ విషాద నష్టాన్ని తట్టుకునే శక్తి అందరికీ కలగాలి అని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు.

మహేష్ బాబు
పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యను. ఎంతగానో కలచివేసింది. నేను కలుసుకున్న అత్యంత వినయపూర్వకమైన వ్యక్తులలో పునీత్ ఒకరు. అతని కుటుంబ సభ్యులకు మరియు ప్రియమైన వారికి హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నట్లు మహేష్ బాబు ట్వీట్ చేశారు.

మోహన్ బాబు
మహానటుడు రాజ్‌కుమార్ అంటే కన్నడ రాష్ట్రం. మా కుటుంబానికి వారి కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యం ఉంది. రాజ్‌కుమార్ గారి కుమారుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణం చెందిన వార్త విని దిగ్ర్బాంతికి లోనయ్యాను. ఇది కన్నడ సినీ పరిశ్రమకే కాదు... యావద్ భారతదేశ సినీ పరిశ్రమకి తీరని లోటు.. అని డా. మోహన్ బాబు తెలియజేశారు

తమన్నా భాటియా
స్టార్ హీరోయిన్ తమన్నా కూడా పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్లు ట్వీట్ చేశారు. షాక్ అయ్యాను అంటూ పదాలు కూడా రావడం లేదని చాలా విచారమైన వార్త అని పేర్కొన్నారు. అలాగే వారి ఆత్మకు శాంతి చేకూరాలని కూడా పలువురు స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు.

థమన్ ట్వీట్
లైఫ్ అనేది ఎవరు విశ్లేశించలేరు. కొన్ని నష్టాలు ఆమోదయోగ్యం కాదు. దేవుడా నువ్వు ఇంత క్రూరంగా ఉండలేవు, మంచి మనసున్న వాళ్ళని దూరం చేసుకోలేవు. నా కన్నీళ్లను అదుపు చేసుకోలేను.... పునీత్ అన్నా మిమ్మల్ని మరువలేను అంటూ యువ సంగీత సంచలనం థమన్ భావోద్వేగంతో ట్వీట్ చేశాడు.
Recommended Video

డైరెక్టర్ హరీష్ శంకర్
దర్శకుడు హరీష్ శంకర్ కూడా పునీత్ రాజ్ కుమార్ మరణవార్త ను నమ్మలేను అని ట్వీట్ చేశాడు. ఇది నమ్మశక్యం కాదు అంటూ.. అతను దీనికి అర్హుడు కాదు. ఏమి చెప్పాలో తెలియక షాక్ అయ్యాను అని పేర్కొన్నాడు. అలాగే మరికొందరు ప్రముఖ దర్శకులు కూడా పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.


Click it and Unblock the Notifications











