Brahmaji: భార్య రెండో పెళ్లి.. పిల్లలను కనకపోవడంపై బ్రహ్మాజీ క్లారిటీ!

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత సీనియర్ నటులలో ఒకరైన బ్రహ్మాజీ విభిన్నమైన పాత్రలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సీరియస్ రోల్స్ మాత్రమే కాకుండా కామెడీ పాత్రలో కూడా ఆయన నటించే విధానం ఎంతగానో ప్రత్యేకంగా ఉంటుంది. అయితే బ్రహ్మాజీ పర్సనల్ లైఫ్ పై కూడా అప్పుడప్పుడు కొన్ని ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. అయితే ఆయన పెళ్లి విషయంపై చాలాసార్లు ఓపెన్ అయ్యారు. ఇక పిల్లలను కనకపోవడంపై కూడా ఇటీవల ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

హీరోలతో మంచి స్నేహం

హీరోలతో మంచి స్నేహం

బ్రహ్మాజీ అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా బాగా తెలుసు. గత 30 ఏళ్లకు పైగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక వయసుతో సంబంధం లేకుండా ఒకే తరహా లుక్ ను మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఆయన వయసు పై ఇతర హీరోలు కూడా చాలా జోకులు వేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు. బ్రహ్మాజీ కూడా వారితో చాలా స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. దాదాపు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా బ్రహ్మాజీ కలిస్తే సెట్స్ లోనే ఆటపట్టిస్తుంటారు.

 హీరోగా కూడా..

హీరోగా కూడా..

బ్రహ్మాజీ హీరోగా అడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీ మొదట్లో కృష్ణవంశీ, రవితేజ ఇద్దరితో కూడా చాలా క్లోజ్ గా ఉండేవారు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అయితే హీరోగా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో బ్రహ్మాజీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఇండస్ట్రీలో స్థిరపడిపోయారు విభిన్నమైన సినిమాలలో స్పెషల్ పాత్రలలో కనిపిస్తూ మెప్పించారు.

చేసేది చిన్న పాత్ర అయినా..

చేసేది చిన్న పాత్ర అయినా..

హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన తర్వాత అటువైపుగా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత సినిమాలలో పవర్ఫుల్ పాత్రల్లో నటించడానికి ఒప్పుకుంటూ వచ్చారు. చేసేది చిన్న పాత్ర అయినా సరే సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉండాలని ఆలోచిస్తూ వెళుతున్నారు. ప్రస్తుత జననేషన్లో కూడా చాలామంది హీరోలు ఆయనతో నటించడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.

 అప్పటికే తనకు విడాకులు

అప్పటికే తనకు విడాకులు

ఇక చేతినిండా సినిమాలతో కొనసాగుతున్న బ్రహ్మాజీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మ్యారేజ్ లైఫ్ గురించి కూడా ప్రత్యేకంగా వివరణ ఇచ్చాడు. చెన్నైలో మొదట నటనపై శిక్షణ తీసుకుంటున్నప్పుడు ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తను ఒక బెంగాలీ అమ్మాయి. ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అయితే నేను పెళ్లి చేసుకున్న సమయానికి ఆమె భర్త నుంచి విడిపోయి ఉంది అని బ్రహ్మాజీ తెలియజేశాడు

పిల్లలు వద్దనుకున్నాము

పిల్లలు వద్దనుకున్నాము

ఆమెతో మంచి పరిచయం నన్ను ఎంతగానో మార్చింది. ఆ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని కుటుంబ సభ్యులను కూడా ఒప్పించడం జరిగింది. మొదట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. కానీ ఏదేమైనా తననే పెళ్లి చేసుకోవాలి అని పెద్దలను ఒప్పించి మరీ చేసుకున్నాను. అయితే తనకు అప్పటికే ఒక బాబు ఉన్నాడు. కాబట్టి పిల్లలు వద్దని అనుకున్నాము.. ఆ అబ్బాయి పిట్టగూడా అనే సినిమాతో కూడా ఎంట్రీ ఇచ్చినట్లు బ్రహ్మాజీ వివరణ ఇచ్చాడో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X