జైలు పాలైన మరో స్టార్ కొరియోగ్రాఫర్ .. ఉలిక్కిపడ్డ టాలీవుడ్, ఈ డ్యాన్స్ మాస్టర్లకి ఏమైంది?
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి కలకలం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడంతో జైలుకు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. జానీ వ్యవహారం సద్దుమణగక ముందే మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్ అయ్యాడు. ఈ వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం, రేవ్ పార్టీలు కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం బెంగళూరులో జరిగిన రేవ్‌పార్టీ ఇన్సిడెంట్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వాసు అనే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఆర్గనైజ్ చేసిన ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ఇతర ప్రముఖులు భారీగా హాజరయ్యారు. బర్త్ డే పార్టీకి పర్మిషన్ తీసుకుని దానిని రేవ్‌పార్టీగా మార్చేశారు నిర్వాహకులు. పోలీసులు ఆకస్మాత్తుగా రైడ్ చేయడంతో అసలు బండారం బయటపడింది.

రేవ్‌పార్టీకి హాజరైన వారిలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. లిస్ట్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు వినిపించగా, తాను ఆ పార్టీలో లేనని హైదరాబాద్‌లోని తన ఫాంహౌస్‌లో చిల్ అవుతున్నానని హేమ వీడియోలు వదిలింది. దీంతో బెంగళూరు పోలీసులు స్పందించి.. అరెస్ట్ అయిన వారిలో హేమ ఉన్నట్లుగా ఆధారాలతో సహా బయటపెట్టారు.
తన స్టేజ్ నేమ్‌ని దాచి కృష్ణవేణి అనే తన అసలు పేరుతోనే హేమ పార్టీకి వచ్చినట్లుగా కొన్ని ఛానెల్స్ కథనాలు ప్రసారం చేశాయి. ఈ వ్యవహారంలో పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించకపోవడంతో కర్ణాటక పోలీసులు నేరుగా హైదరాబాద్ వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆమెను రిమాండ్‌కు పంపడంతో కొద్దిరోజులు పరప్పన అగ్రహార జైలులో ఉన్న హేమ.. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు.

తాజాగా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌పై పోలీసులు జరిపిన దాడిలో డ్రగ్స్ రాకెట్ వెలుగుచూసింది. కొందరు ప్రముఖులు మద్యం సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు దొరికిపోయారు. వీరిలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి కూడా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కన్హాతో పాటు ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ప్రముఖ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ప్రసారమవుతోన్న డ్యాన్స్ షోలో కన్హ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. కన్హా, ప్రియాంక రెడ్డిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అయితే టాలీవుడ్‌కు చెందిన కొరియోగ్రాఫర్లు ఒక్కొక్కరిగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంతో ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











