జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కారణమిదే.. కమెడియన్ సత్య కామెంట్స్

స్వామి రారా సినిమా ద్వారా మంచి కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సీనియర్ కమెడియన్స్ ని మరిపిస్తున్న సత్య కెరీర్ మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారట. దర్శకుడవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సత్య ఊహించని విధంగా నటుడిగా మారిపోయాడు. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య తన కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు.

 డైరెక్టర్ అవ్వాలని..

డైరెక్టర్ అవ్వాలని..

కెరీర్ మొదట్లో కొన్ని ఇబ్బందుల తరువాత ద్రోణ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయంలో ఆ చిత్ర దర్శకుడు నన్ను కమెడియన్ గా మార్చేశారు. నితిన్ కూడా ఒప్పుకున్నాడు. అలా మొదలైన నా ప్రయాణం ఇంతవరకు బాగానే సాగింది. కానీ నాకు దర్శకుడు అవ్వాలనే కోరిక బలంగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో ఒక సినిమా తీస్తాను.

 కెరీర్ అక్కడే మలుపు తిరిగింది..

కెరీర్ అక్కడే మలుపు తిరిగింది..

యాక్టర్ గా మారినప్పుడు ఆరేళ్ళ వరకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక నిఖిల్ తో స్వామి రారా సినిమాలో నేను చేసిన పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో ఆ తరువాత ఆఫర్స్ ఎక్కువగా వచ్చాయి. నా కెరీర్ ఛలో సినిమా కూడా చాలా స్పెషల్. ఆ సినిమాతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఓ వర్గం ఆడియెన్స్ నన్ను ఎక్కువగా లైక్ చేయడం స్టార్ట్ చేశారు.

జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కారణం..

జబర్దస్త్ నుంచి తప్పుకోవడానికి కారణం..

జబర్దస్త్ షో ద్వారా నాకు ఒక విధంగా మంచి గుర్తింపే లభించింది. ధన్ రాజ్ గ్రూప్ లో కామెడీ చేస్తూ ఎన్నో కొత్త విషయాలని నేర్చుకున్నాను. అయితే ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వచ్చాయి. అందుకే జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. జబర్దస్త్ నుంచి తప్పుకోవడం అప్పట్లో ఒక విధంగా రిస్క్ అయితే చేశాను. అదృష్టవశాత్తూ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గేలేదు.

Recommended Video

Dhanraj & Venu Tillu Hilarious Skit On Corona
రాజమౌళి గారు మెచ్చుకున్నారు..

రాజమౌళి గారు మెచ్చుకున్నారు..

నాకు అందరి దర్శకులతో వర్క్ చేయాలని ఉంది. ఎక్కువగా త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, రాజమౌళి గారి సినిమాల్లో కామెడీ చేయాలని ఉంది. ఒకసారి రాజమౌళి గారు నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు. మత్తు వదలరా సినిమాలో ఆయన నా పాత్రను చాలా ఎంజాయ్ చేసినట్లు చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక నెక్స్ట్ రామ్ రెడ్ సినిమాలో ఒక బలమైన పాత్రలో కనిపించబోతున్నాను. అలాగే సోలో బ్రతుకే సో బెటర్, శ్రీకారం వంటి సినిమాలతో రాబోతున్నట్లు సత్య వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X