twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనాతో కమెడియన్ వేణుగోపాల్ కన్నుమూత.. షాక్‌లో టాలీవుడ్‌

    |

    టాలీవుడ్‌లో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టు కోసూరి వేణుగోపాల్ ఇక లేరు. కరోనావైరస్ పాజిటివ్‌కు గురైన చికిత్స పొందుతూ ప్రైవేట్ హాస్పిటల్‌ మరణించారు. ఆయన మృతికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

    23రోజులుగా ఆస్పత్రిలోనే..

    23రోజులుగా ఆస్పత్రిలోనే..

    గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో గత 23రోజులుగా చికిత్స అందుకుంటున్న వేణు గోపాల్ ఎక్కువ రోజులు వెంటిలేటర్‌పైనే ఉన్నారు. వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నం చేశారు. కరోనా నెగెటివ్‌ వచ్చాక కూడా ఆయన కోలుకోలేదట. ఈ విషయాన్ని మీడియాకు తెలిపిన కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

     ఉద్యోగం చేసుకుంటూనే..

    ఉద్యోగం చేసుకుంటూనే..

    పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చెందిన వేణు గోపాల్ కొన్నేళ్ల పాటు ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పని చేస్తూ పదవీ విరమణ చేశారు. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై మక్కువ ఉన్నప్పటికీ కుటుంబం కోసం వృత్తి కోసం అటు వైపు పూర్తిగా దృష్టి పెట్టలేదు. ఒక వైపు ఉద్యోగం చేసుకుంటూనే ఖాళీ సమయాల్లో ఆడిషన్స్ కి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి.

    నచ్చిన సినిమాలు చేసుకుంటూ..

    నచ్చిన సినిమాలు చేసుకుంటూ..

    ఇక మెల్లగా అవకాశాలు వచ్చిన తరువాత వేణు గోపాల్ ఉద్యోగంలో చేస్తూనే సినిమాల్లో నటించారు. అందులో కూడా తనకు నచ్చిన సినిమాలే ఆయన ఎక్కువగా చేశారు. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవలన్నదే ఆయన తాపత్రయం. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో ఆయన చేసిన ఒక కామెడీ రోల్ సినిమాలో హైలెట్ గా నిలిచింది.

    రాజమౌళి సినిమాలో..

    రాజమౌళి సినిమాలో..

    ఎక్కువగా రాజమౌళి కమర్షియల్ సినిమాల్లో వేణుగోపాల్ మంచి క్యారెక్టర్స్ తో కనిపించారు. ఛత్రపతి, విక్రమార్కుడు, పిల్లజమిందారు, భలే భలే మగాడివోయ్, ఛలో, ఆమీతుమీ వంటి సినిమాల్లో కూడా ఆయన మంచి టైమింగ్ ఉన్న కామెడీ పాత్రల్లో నటించారు. కనిపించేది కొంత సేపే అయిన వేణు గోపాల్ నటనలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ఉంటుంది.

    షాక్ లో టాలీవుడ్..

    షాక్ లో టాలీవుడ్..

    ఇక ఆయన కుటుంబ విషయానికి వస్తే భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఆయన ఎఫ్‌సీఐలో ఉద్యోగం కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇక వేణు గోపాల్ మృతి పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.

    English summary
    Tollywood comedian Venugopal Kosuri died with Coronavirus. He was died while getting treatment. Tollywood industry condolences to the Venugopal death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X