ఎన్నికల బరిలో కామెడీ కింగ్ బ్రహ్మానందం.. ఎక్కడంటే?

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం సిల్వర్ స్క్రీన్ పై తనదైన శైలిలో కామెడీ పాత్రలతో ఎంతగా ఆకట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీలో బ్రహ్మానందాన్ని బీట్ చేసే వారు ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి. కామెడిలో దాదాపు అన్ని రకాల యాంగిల్స్ ను టచ్ చేసిన బ్రహ్మానందం పర్సనల్ లైఫ్ లో మాత్రం అందుకు భిన్నమైన వ్యక్తి. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే బ్రహ్మానందం రాజకీయాలపై కూడా ఆసక్తి గలవారు అని చాలాసార్లు రుజువు చేశారు. వివిధ రాష్ట్రాల్లో బ్రహ్మానందం ప్రచారంలో మాత్రమే ఒక సెలబ్రెటీగా పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఇక ఇటీవల మరోసారి అదే తరహాలో ప్రచారాలు స్టార్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

సరికొత్త యాక్టింగ్: కామెడీ కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న బ్రహ్మానందం ఎన్నో వేల సినిమాలో నటించి వరల్డ్ గిన్నిస్ బుక్ లో కూడా స్థానం సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం మాత్రం ఆయన చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు. అది కూడా సెలెక్టివ్ గా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో తనలోని సరికొత్త నటుడిని కూడా ఆయన బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా రంగమార్తాండ సినిమా ద్వారా తనలోని సీరియస్ నటుడిని కూడా బ్రహ్మానందం పరిచయం చేశారు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన బ్రహ్మానందం పాత్ర అందరికి కనెక్ట్ అయ్యింది.

brahmanandam

ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం: ఇదిలా ఉంటే బ్రహ్మానందం ఇప్పుడు రాజకీయాలలోకి వస్తున్నాడా అంటే చెప్పలేం. అయితే కర్ణాటక ఎన్నికలలో ఇప్పుడు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి కె సుధాకర్ తరుపున చిక్ బుల్లాపూర్ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు. ప్రజల్లోకి వచ్చి సుధాకర్ కి ఓటు వేయాలని అడిగారు.

brahmanandam

తెలుగు ప్రజలు ఉండడంతో..: అదే సమయంలో తనదైన శైలిలో కామెడీ డైలాగ్స్ తో పంచ్ లు పేలుస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం విశేషం. చిక్ బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ నేపధ్యంలో బీజేపీ పార్టీ బ్రహ్మానందాన్ని ఎన్నికల ప్రచారం కోసం రంగంలోకి దించింది అనే టాక్ వినిపిస్తోంది. అయితే బ్రాహ్మి రాజకీయం కేవలం కర్ణాటక ఎన్నికల ప్రచారం వరకేనా లేదంటే తెలుగు రాష్ట్రాలలో కూడా కొనసాగుతుందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది.

బ్రాహ్మి బీజేపీ పార్టీలో చేరితే..: బీజేపీ పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా టాలీవుడ్ ప్రముఖులని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మానందం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్ధి తరుపున పాల్గొనడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇక వేళ బ్రాహ్మి బీజేపీ పార్టీలో చేరితే మాత్రం ఏపీ రాజకీయాలలో అతన్ని కీలకంగా ఉపయోగించుకునే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

brahmanandam

మరొక టాక్ వైరల్: అలాగే మరో ఆరు నెలల్లో తెలంగాణలో కూడా ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో బ్రహ్మానందం ఇక్కడ కూడా కీలకంగా మారుతాడని భావిస్తున్నారు. అయితే కె సుధాకర్ బ్రహ్మానందంకి మిత్రుడు కావడం వలన అతని తరుపున ప్రచారం చేసి ఉంటారని, రాజకీయాలలోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు అనే మాట మరో వర్గం నుంచి వినిపిస్తోంది. మరి వీటిలో ఏది వాస్తవం అనేది బ్రహ్మానందం స్పందించే వరకు తెలియదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X