ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. హాస్పిటల్ బెడ్‌పై తల్లడిల్లుతున్న కమెడియన్

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు 100ల చిత్రాల్లో నటించిన కామెడీ విలన్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషయం ఉంది. ఆయన ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యంతో సినిమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఓవైపు ఆరోగ్యం బాగాలేక, మరోవైపు చేతిలో డబ్బులు లేక ఫిష్ వెంకట్ ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్రాణాల మీదకు రావడం బాధాకరం. ఇప్పటికే ఆయనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తగిన సాయం కూడా అందించారు. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..

ఫిష్ వెంకట్ వివరాలు..
తెలంగాణలోని హైదరాబాద్ మహా నగరంలోనే ఫిష్ వెంకట్ పుట్టి పెరిగారు. ఆయన 1971 ఆగస్టు 31న జన్మించడం విశేషం. బాల్యమంత భాగ్యనగరంలోనే గడిపారు. ఇక సినిమాలపై ఉన్న ఆసక్తితో 2000లలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. దాదాపు 25 ఏళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిష్ వెంకట్ యాక్టివ్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, వెంకటేశ్, రవితేజ, నాగార్జున, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఆయన కామెడీ, విలన్ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. తెలంగాణ యాస, భాషతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Tollywood Comedy Villain Fish Venkat Health Condition is Critical

అనారోగ్యంతో బాధపడుతూ..
రెండుమూడేళ్లుగా ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించినా ఫిష్ వెంకట్ ఆర్థికంగా మాత్రం బలపడలేదు. ఇక కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇబ్బందిపడుతున్నాడు. గతంలో చికిత్సకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.2 లక్షలు సాయం కూడా చేశారు. కానీ అప్పుడు తాత్కాలికంగా కోలుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ ఆస్పత్రి బెడ్ పై చావు బతుకుల్లో ఉన్నారు. ఆయనకు సరైన ట్రీట్ మెంట్ అందిస్తే బతికే ఛాన్స్ ఉందని అంటున్నారు.

సాయం కోరుతూ..
కొంతకాలంగా ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యకు డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారింది. దాంతో ఇప్పుడు అవయవ మార్పిడి చేస్తే ఆయన ప్రాణాలకు ముప్పు తప్పుతుందని, అదొక్కటే మార్గమని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆర్థిక సాయం కోరుతున్నారు. వెంకట్ ను బతికించాలని తాజాగా ఆయన భార్య, కూతురు సినీ ప్రముఖులను, ప్రజలను వేడుకుంటున్నారు.

ఫిష్ వెంకట్ సినిమాలు..
2000లో విడుదలైన సమక్క సారక్క చిత్రంలో తొలిసారిగా ఫిష్ వెంకట్ వెండితెరపై మెరిశారు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రంలో విలన్ టీమ్ లో ఒకరిగా కనిపించి అలరించారు. ఆ తర్వాత నుంచి చాలా సినిమాల్లో నటించారు. చెన్నకేశవ రెడ్డి, దిల్, బన్నీ, ఢీ, యోగి, దుబాయ్ శ్రీను, క్రిష్ణ, బుజ్జిగాడు, రెడీ, ఆంజనేయులు, అదుర్స్, మిరపకాయ్, కందిరీగ, రచ్చ, గబ్బర్ సింగ్, బలుపు, అత్తారింటికి దారేది వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక చివరిగా 2025 జనవరి 31న ఆహాలో విడుదలైన కాఫీ విత్ కిల్లర్ అనే చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X