సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొన్న ఆయన అనంతరం ఆ పనులన్నీ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి బయలు దేరారు. అయితే మార్గం మధ్యలోనే రాకేష్ మాస్టర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్లో చికిత్స అందుకున్న రాకేష్ మాస్టర్ నేడు ఉదయం ఇంట్లో రక్తవిరోచనాలు చేసుకున్నారు. ఇక వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తరువాత ప్రాణాలు కాపాడడం కోసం శత విధాల ప్రయత్నం చేసిన గాంధీ వైద్యులకు ఆయన శరీరం సహకరీంచలేసు. వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఇక ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతములో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Tollywood dance choreographer rakesh master passed away

మంచి కొరియోగ్రాఫర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రాకేష్ మాస్టర్ మొదట తమిళనాడులో కొన్ని సినిమాలకు వర్క్ చేశారు. ఆ తర్వాత సైడ్ డాన్సర్ గా కూడా ఆయన మరి కొంతకాలం గడిపారు. ఇక హైదరాబాదులో చిత్ర పరిశ్రమ మొత్తం షిఫ్ట్ అయిన తర్వాత చాలామంది యువకులకు రాకేష్ మాస్టర్ అవకాశాలు ఇచ్చారు. ముక్కురాజ్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకున్న రాకేష్ మాస్టర్ ఆ తర్వాత హీరో వేణు సినిమాలతో మొదట కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

ఆ తరువాత రామ్ పోతినేని దేవదాసు వంటి సినిమాలకు కూడా కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక చాలామంది దర్శకుల దగ్గర వర్క్ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ వంటి రియాల్టీ షోలో కూడా వర్క్ చేశారు. ఆయన కొన్నాళ్లపాటు ఆ డ్యాన్స్ షోకు జడ్జిగా కూడా ఉన్నారు. ఇక రాకేష్ మాస్టర్ హఠాత్తుగా మరణించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్ అయింది. ఇక మాస్టర్ నివాళులు అర్పించేందుకు ప్రస్తుతం డాన్స్ మాస్టర్లు సినీ ప్రముఖులు ఆయన స్వగృహానికి వెళుతున్నట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X