Rakesh Master No More: స్టార్ హీరోలకు డ్యాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్.. ప్రభాస్ తో పాటు వాళ్ళ సినిమాలకు కూడా..
కొరియోగ్రాఫర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న రాకేష్ మాస్టర్ హఠాత్తుగా మృతి చెందడం ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది. చిత్ర పరిశ్రమలో రాకేష్ మాస్టర్ అంటే తెలియని వారు ఉండరు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన కొంతమంది అగ్ర హీరోలకు కూడా డాన్స్ నేర్పించారు. అలాగే ఆయన శిష్యరికంలో వచ్చిన శేఖర్ మాస్టర్ ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు.
ఇక కొంతమంది యువ హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఇక ఈటీవీ జీతెలుగు వంటి ఛానల్స్ లో ప్రసారమైన రియాల్టీ షోలలో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. ఇక రాకేష్ మాస్టారు మృతి చెందడం అందరిని ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఆయన కెరీర్ కు సంబంధించిన కొన్ని వివరాల్లోకి వెళితే..

చిన్నతనంలోనే అలా: రాకేష్ మాస్టర్ తిరుపతిలో జన్మించారు. చిన్నతనం మొత్తం కూడా అక్కడే ఆయన గడిపారు. అయితే యుక్త వయసులోకి రాకముందే డాన్స్ మాస్టర్ గా గుర్తింపును అందుకోవాలని ఎంతగానో హార్డ్ వర్క్ చేశారు. ఇక మొదట చెన్నైలో ఒక డాన్సర్ గా కొనసాగిన రాకేష్ మాస్టర్ ఆ తర్వాత హైదరాబాద్కు వచ్చి ఇక్కడే ప్రత్యేకంగా ఒక డాన్స్ స్కూల్ ని కూడా ప్రారంభించారు. చాలామంది ప్రముఖుల పిల్లలకు కూడా ఆయన డ్యాన్స్ నేర్పించారు.

మొదట అవకాశం ఇచ్చిన హీరో: చాలా వేగంగానే డాన్స్ నేర్చుకున్న రాకేష్ మాస్టర్ కొన్నాళ్లపాటు చిన్న సినిమాల్లో డాన్సర్ గా మారి ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా కూడా చేశారు. ఇక ఆయనకు మొదట అవకాశం ఇచ్చింది మాత్రం హీరో వేణు తొట్టెంపూడి. ఆయన మొదట్లో చేసిన సినిమాలన్నిటికి కూడా దాదాపు రాకేష్ మాస్టార్ కొరియోగ్రఫీ చేయడం జరిగింది. ఇక అందులో చిరునవ్వుతో సినిమాకు కూడా వర్క్ చేయగా ఆ సినిమాకు మంచి గుర్తింపు లభించింది.
ఆ దర్శకుడితో ఎక్కువ సినిమాలు: అలాగే రాకేష్ మాస్టర్ ప్రముఖ దర్శకుడు వైవిఎస్ చౌదరి సినిమాలకు కూడా తరచుగా కొరియోగ్రఫీ చేస్తూ ఉండేవారు. ఇక దేవదాసు సినిమాకు కూడా ఆయన కొరిగ్రాఫర్ గా వర్క్ చేశారు. లాహిరి లాహిరిలో.., సీతయ్య వంటి సినిమాలకు కూడా వర్క్ చేసిన రాకేష్ మాస్టర్ మంచి గుర్తింపును అందుకున్నారు. ఆ తరువాత మరి కొంతమంది ప్రముఖ హీరోల సినిమాల పాటలకు ఆయన డాన్స్ కంపోజ్ చేశారు.

ప్రభాస్, రామ్ కు ప్రత్యేకంగా శిక్షణ: అయితే రాకేష్ మాస్టర్ సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నప్పటికీ కూడా తన డాన్స్ స్కూల్ ను యధావిధిగా కొనసాగించారు. అయితే ఆయన ప్రత్యేకంగా కొంతమంది ఇండస్ట్రీలోని వారసులకు కూడా ప్రత్యేకంగా డాన్స్ నేర్పేవారు. అందులో ప్రభాస్ కూడా ఉన్నాడు. ప్రభాస్ ఇండస్ట్రీలోకి రాకముందు రాకేష్ మాస్టర్ దగ్గర కూడా కొన్ని రోజులపాటు శిక్షణ తీసుకున్నాడు. అలాగే రామ్ పోతినేని కూడా రాకేష్ మాస్టర్ శిష్యుడే.

టెలివిజన్ ప్రపంచంలో: ఇక రాకేష్ మాస్టర్ టెలివిజన్ ప్రపంచంలో కూడా అందరికీ తెలిసిన వారే. ఆట షోలో కూడా చాలా కాలం పాటు ఆయన జడ్జిగా కొనసాగారు. అంతేకాకుండా ఈటీవీలో వచ్చే ఢీ షోలో కూడా రాకేష్ మాస్టర్ జడ్జిగా కూడా కనిపించారు. ఇక అనంతరం జబర్దస్త్ షోలో కూడా పలు ఎపిసోడ్స్ లో కనిపించిన రాకేష్ మాస్టర్ అనంతరం సొంతంగా యూట్యూబ్ ఛానల్ స్థాపించి అందులో వివిధ రకాల వీడియోలు పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











