మూవీ హిట్టయిన జోష్‌లో.. డైరెక్టర్, హీరో లిప్‌లాక్.. టాలీవుడ్‌లో చెత్త సంస్కృతా?
హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే సినిమా అద్భుతంగా వాస్తుంది అంటారు. ఇక దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా హీరో వర్క్ చేస్తే సినిమా స్థాయి మరో లెవెల్ కి వెళుతుంది. కానీ హీరో హీరోయిన్ మధ్య ఉండాల్సిన లిప్ లాక్ ఇక్కడ దర్శకుడికి హీరోకు ఉండడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆప్యాయంగా ఇచ్చుకున్నారో లేక ప్రమోషన్స్ స్టంట్ వేశారో తెలియదు గాని హీరో డైరెక్టర్ మధ్య లిప్ లాక్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కృష్ణ అండ్ హిజ్ లీలా..
ఇటీవల సురేష్ బాబు ప్రొడక్షన్ లో కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం చిన్న సినిమాలు ఓటీటీలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా తరువాత ఓటీటీ రిలీజ్ లు ఎక్కువవుతున్నాయి. మంచి టీమ్ నుంచి వచ్చిన కృష్ణ అండ్ హిజ్ లీలా కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకుంటోంది.

రానా సహాయంతో..
క్షణం దర్శకుడు రవికాంత్ తెరకెక్కించిన డిఫరెంట్ లవ్ స్టోరీకి రానా ప్రమోషన్స్ లో బాగానే హెల్ప్ చేశాడు. ఇక సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇకపోతే చిత్ర కథానాయకుడు సిద్దు జొన్నలగడ్డ ఇటీవల దర్శకుడితో ఫోటోకి స్టిల్ ఇచ్చిన విధానం అందరిని షాక్ కి గురి చేసింది.

హీరో దర్శకుడి లిప్ లాక్..
దర్శకుడిపై హీరోలకు ఒక ప్రేమ ఉండడం సహజమే. చాలా మంది హీరోలు గతంలో దర్శకులకు ముద్దులు ఇచ్చారు. కానీ ఇలా కాదు. ఏకంగా లిప్ లాక్ ఇచ్చుకోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఒకసారి మహర్షి సక్సెస్ మీటింగ్ లో మహేష్ బాబు వంశీ పైడిపల్లిని బుగ్గపై ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ ఫొటో కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యింది.
Recommended Video

అసలు సంగతేంటి?
ఇక ఇప్పుడు రవికాంత్ పేరేపు హీరో శ్రీకాంత్ జొన్నలగడ్డ ఏకంగా లవర్స్ మాదిరిగా లిప్ లాక్స్ ఇచ్చుకోవడం మరింత వైరల్ గా మారింది. కృష్ణ అండ్ హిజ్ లీలా సక్సెస్ అయిన ఫీలింగ్ తో ఇలా చేశారా.. లేక ప్రమోషన్స్ స్టంట్ ఏమైనా వేశారా? అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ ఫోటోపై ఈ స్టార్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. కథానాయకుడు సిద్దు ఈ సినిమాకు కో రైటర్ కూడా వర్క్ చేశాడు.


Click it and Unblock the Notifications











