టాలీవుడ్‌లో విషాదం.. యువ దర్శకుడు రఘురామ్ కన్నుమూత

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్‌, రైటర్‌, దర్శకుడు బండి రఘురామ్(Bandi Raghuram)కన్నుమూశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, సాయంత్రం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారని సమాచారం. ఈ ఘటన సినీ వర్గాలు, మీడియా రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

బండి రఘురామ్‌ కేవలం దర్శకుడే కాదు.. జర్నలిస్ట్‌గా, రచయితగా, సినిమా విశ్లేషకుడిగా కూడా. ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్‌గా పనిచేసి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఆయన రాసిన సినిమా రివ్యూలు, విశ్లేషణలు పాఠకుల్లో మంచి ఆదరణ పొందాయి. సినిమాపై ఆయనకు ఉన్న అవగాహన, విశ్లేషణ శైలి ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

Tollywood Director Bandi Raghuram Passes Away Film and Media Industry in Shock

విద్యాపరంగా కూడా రఘురామ్‌ అత్యంత ప్రతిభావంతుడు. జర్నలిజంలో ఎంఫిల్‌, ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి, విదేశాల్లోని లిబ్యన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. ఎడ్యూకేషన్ కెరీర్ లో ఉన్నత స్థాయిలో ఉన్నా.. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఆ మార్గాన్ని వదిలి టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు.

సినీ రంగంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ దర్శకుడు సానాయాదిరెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో-డైరెక్టర్‌గా పనిచేస్తూ మంచి అనుభవాన్ని సంపాదించారు. అనంతరం 2004లో 'వరం' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఇందులో శివాజీ, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే.. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, ఆయన ప్రయత్నం, కథ చెప్పే విధానం సినీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత దర్శకుడిగా మరిన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే, రైటర్‌గా, గోస్ట్ రైటర్‌గా పలు ప్రాజెక్ట్స్‌లో పనిచేశారు. తెర వెనుక ఆయన చేసిన రచనలకు మంచి గుర్తింపు వచ్చింది. చివరి వరకు సినిమాపై ఆసక్తిని వదలకుండా, కొత్త కథలతో మళ్లీ దర్శకుడిగా నిలదొక్కుకోవాలని ప్రయత్నించారు.

రఘురామ్‌ స్వస్థలం జగిత్యాల కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి, సన్నిహితులకు ఆయన మరణం తీరని లోటుగా మిగిలింది. బండి రఘురామ్‌ మరణంతో టాలీవుడ్‌తో పాటు మీడియా రంగంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Read more about: tollywood journalist director
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X